3 దక్కేదెవరికి?
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:33 AM
వరుసగా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరాలన్న ఫ్రాన్స్ స్వప్నాన్ని స్పెయిన్ భగ్నం చేయగా.. ఆరు దశాబ్దాల తర్వాత రెండో టైటిల్‌పై ఆశలు పెట్టుకున్న ఇంగ్లండ్‌కు అర్జెంటీనా...
నేటి రాత్రి 2.30 నుంచి యునైటెడ్8లో..
ప్లేఆఫ్స్ బరిలో ఫ్రాన్స్ X ఇంగ్లండ్
మయామి: వరుసగా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరాలన్న ఫ్రాన్స్ స్వప్నాన్ని స్పెయిన్ భగ్నం చేయగా.. ఆరు దశాబ్దాల తర్వాత రెండో టైటిల్‌పై ఆశలు పెట్టుకున్న ఇంగ్లండ్‌కు అర్జెంటీనా షాకిచ్చింది. సెమీస్‌లో ఓడిన ఈ రెండు జట్లు ఇప్పుడు ప్లేఆఫ్స్‌లో తలపడబోతున్నాయి. ఈ కాంస్య పతకపోరు శనివారం తెల్లవారుజామున జరుగనుంది. అత్యంత బలంగా కనిపించిన ఫ్రాన్స్ ఇలా మూడో స్థానం కోసం ఆడాల్సి రావడం ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేనిదే. ఇక 14 ఏళ్లుగా ఫ్రాన్స్ మేనేజర్‌గా కొనసాగుతున్న డిడియెర్ డిషాంప్స్‌కు కూడా ఇదే చివరి మ్యాచ్ కానుంది. విజయంతో అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలని కిలియన్ ఎంబాపె బృందం భావిస్తోంది. ఎంబాపె ఇప్పటికే 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో మెస్సీతో పాటు కొనసాగుతున్నాడు. సెమీస్‌లో తేలిపోయిన తను ప్లేఆఫ్స్‌లో మాత్రం సత్తా చూపాలనుకుంటున్నాడు. ఫ్రాన్స్ తామాడిన మూడు ప్లేఆ్‌ఫ్సలో రెంటినీ గెల్చుకుంది. అటు ఇంగ్లండ్‌లో హ్యారీ కేన్, బెలింగ్‌హామ్ ఆరేసి గోల్స్‌తో జట్టు విజయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. నేటి మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరి ఆట కీలకం. మరోవైపు ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఫిఫా టిక్కెట్ సైట్స్‌లో ఇప్పటికీ 7వేల టిక్కెట్లు అందుబాటులో ఉండడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్ 2026: ఫైనల్ మ్యాచ్‌కు డొనాల్డ్ ట్రంప్
లార్డ్స్‌కు రోహిత్ శర్మ తల్లిదండ్రులు.. రిటైర్‌మెంట్ వార్తల వేళ కీలక పరిణామం!