బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా మృతి
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:14 AM
ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దిన కొద్దిమందిలో ఒకరైన ఇందర్‌జిత్ సింగ్ బింద్రా (84) ఆదివారం కన్నుమూశారు. 1993-1996 మధ్య ఐఎస్ బింద్రా బోర్డు అధ్యక్షుడిగా...
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దిన కొద్దిమందిలో ఒకరైన ఇందర్‌జిత్ సింగ్ బింద్రా (84) ఆదివారం కన్నుమూశారు. 1993-1996 మధ్య ఐఎస్ బింద్రా బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) చీఫ్‌గా 36 ఏళ్లపాటు పనిచేశారు. 1987 వరల్డ్‌క్‌పనకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం వెనుక మాజీ అధ్యక్షులు ఎన్‌కేపీ సాల్వే, జగ్‌మోహన్ దాల్మియాతోపాటు బింద్రా పాత్ర ఎంతో ఉంది. ఆసియా దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకతో సమన్వయం చేసుకొంటూ వరల్డ్‌క్‌పను ఉపఖండానికి తీసుకురావడంలో బింద్రా ఎంతో కృషి చేశారు. ఇంగ్లండ్ ఆవల జరిగిన తొలి మెగా టోర్నీ కూడా ఇదే కావడం విశేషం. 1986లో ఇండో-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు భారత్‌లో పర్యటించేందుకు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, అప్పటి పాక్ నియంత జనరల్ జియా ఉల్ హక్‌ను భారత్‌లో పర్యటించాలని సూచించడం ద్వారా ప్రతిష్ఠంభనకు బింద్రా తెరదించినట్టు టీమిండియా మాజీ మేనేజర్ అమృత్ మాథుర్ తెలిపారు. దాల్మియా-బింద్రా హయాంలోనే 1996 వరల్డ్‌కప్ కూడా ఉపఖండంలో జరిగింది. బింద్రా మృతికి బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి:
మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్
అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ