బలోగన్ రెడ్‌కార్డ్ ‘రివర్స్’
ABN , Publish Date - Jul 07 , 2026 | 06:00 AM
బోస్నియాతో జరిగిన నాకౌట్ పోరులో రెడ్‌కార్డ్‌కు గురైన అమెరికా ఆటగాడు ఫొలారిన్ బలోగన్‌ను తర్వాతి మ్యాచ్ బెల్జియంతో ఆడడానికి...
వాషింగ్టన్: బోస్నియాతో జరిగిన నాకౌట్ పోరులో రెడ్‌కార్డ్‌కు గురైన అమెరికా ఆటగాడు ఫొలారిన్ బలోగన్‌ను తర్వాతి మ్యాచ్ బెల్జియంతో ఆడడానికి అనుమతించడంపై వివాదం రేగింది. వివరాల్లోకెళితే.. బోస్నియాతో జరిగిన రౌండ్-32 మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఆటగాడి కాలిని తొక్కడంతో బలోగన్‌కు రెఫరీ రెడ్‌కార్డ్ చూపించి బయటకు పంపాడు. నిబంధనల ప్రకారం రెడ్‌కార్డ్‌కు గురైతే.. ఆ తర్వాతి మ్యాచ్‌కు అతను దూరమవ్వాల్సి ఉంటుంది. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో.. బలోగన్‌పై విధించిన నిషేధాన్ని ఫిఫా రద్దు చేసినట్టు సమాచారం. బలోగన్‌పై విధించిన ఒక మ్యాచ్ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు ఫిఫా ప్రకటించింది. దీనిపై యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం నిబంధనలకు తూట్లు పొడుస్తుందని విమర్శించింది. మరోవైపు బెల్జియం జట్టు కూడా ఫిపా నిర్ణయాన్ని ప్రశ్నించింది. బలోగన్‌ను ఆడేందుకు ఎందుకు అనుమతించారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించింది. కాగా, ఈ రచ్చపై ట్రంప్ స్పందించారు. నిషేధం విధించేంత తప్పు బలోగన్ చేసినట్టు తనకు అనిపించలేదన్నారు. పునఃసమీక్షించాల్సిందిగా మాత్రమే ఫిఫా అధ్యక్షుడు గియన్నీ ఇన్‌ఫాంటినోను కోరినట్టు మీడియాకు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ
ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు