Share News

డాయ్‌.. డాయ్‌

ABN , Publish Date - May 16 , 2026 | 02:51 AM

కొలంబియా సూపర్‌ స్టార్‌ షకీరా, నైజీరియా గాయకుడు, పాటల రచయిత బర్నా బాయ్‌ ఫిఫా ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌...

డాయ్‌.. డాయ్‌

ఫిఫా వరల్డ్‌ కప్‌ సాంగ్‌ విడుదల

న్యూయార్క్‌: కొలంబియా సూపర్‌ స్టార్‌ షకీరా, నైజీరియా గాయకుడు, పాటల రచయిత బర్నా బాయ్‌ ఫిఫా ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ అధికారిక గీతం ‘డాయ్‌..డాయ్‌’ని ఇక్కడ విడుదలజేశారు. అటు ఫుట్‌బాల్‌ జట్లను, సాకర్‌ ప్రేమికులను మెగా టోర్నమెంట్‌కు ఆహ్వానిస్తూ షకీర, బాయ్‌ పాడిన ఈ పాట ఉర్రూతలూగించేలా సాగింది. ‘ఫుట్‌బాల్‌, సంస్కృతి, ఐక్యత కలగలుపుగా ఉత్సాహభరితంగా సాగిన కార్యక్రమంలో షకీరా, బర్నా బాయ్‌ వరల్డ్‌ కప్‌ థీమ్‌ సాంగ్‌ను ఆవిష్కరించారు’ అని ఫిఫా పేర్కొంది. ఈసారి మెగా టోర్నీలో పాల్గొంటున్న బ్రెజిల్‌, ఉరుగ్వే, అర్జెంటీనా, కొలంబియా జట్ల పేర్లు, ఆ దేశాల ప్రఖ్యాత ఆటగాళ్లను ఓ చరణంలో షకీరా ప్రస్తావిస్తుంది.

ఇవి కూడా చదవండి:

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

Updated Date - May 16 , 2026 | 02:51 AM