అనూహ్యం అమోఘం
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:00 AM
వరల్డ్‌క్‌పలో ఏళ్లనాటి రికార్డులు బద్దలవుతుంటాయి.. అనూహ్య మలుపులతో సరికొత్త స్టార్లు తెరపైకి వస్తుంటారు. అద్భుత విన్యాసాలతో వావ్ అనిపించే గణాంకాలు నమోదవుతుంటాయి...
ప్రపంచకప్‌లో విచిత్రమైన రికార్డులు
వరల్డ్‌క్‌పలో ఏళ్లనాటి రికార్డులు బద్దలవుతుంటాయి.. అనూహ్య మలుపులతో సరికొత్త స్టార్లు తెరపైకి వస్తుంటారు. అద్భుత విన్యాసాలతో వావ్ అనిపించే గణాంకాలు నమోదవుతుంటాయి. అయితే, మెగా టోర్నీలో చిత్రవిచిత్రమైన రికార్డులు కూడా ఉన్నాయి.
అవేంటంటే..
ఎవరూ కోరుకోనిది.. మెక్సికోకు
ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధికంగా 28 మ్యాచ్‌లు ఓడిన చెత్త రికార్డు మెక్సికో పేరిట ఉంది. క్వాలిఫయర్స్‌లో నిలకడైన ప్రదర్శన కనబరచిన మెక్సికో చాలాసార్లు విజయవంతంగా గ్రూప్ దశను దాటింది. ఏడుసార్లు వరుసగా రౌండ్-16కు అర్హత సాధించింది.
ఫాస్టెస్ట్ గోల్..
2002 వరల్డ్‌క్‌పలో టోర్నీ చరిత్రలోనే వేగవంతమైన గోల్ నమోదైంది. మూడోస్థానం కోసం కొరియా-టర్కీ మధ్య జరిగిన మ్యాచ్‌లో టర్కీ ప్లేయర్ హకన్ సుకుర్ 11 సెకన్లలోనే గోల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టర్కీ 3-2తో గెలిచింది.
చిన్నోడు
స్వీడన్‌లో జరిగిన 1958 వరల్డ్‌క్‌పలో మైమరపించే ప్రదర్శన కనబరచిన బ్రెజిల్ గ్రేట్ పీలేను టోర్నీలో ఆడిన పిన్నవయస్కుడిగా పరిగణిస్తున్నారు. ఫైనల్లో ఆడినప్పుడు పీలే వయసు 17 ఏళ్ల 234 రోజులు. కానీ, విశ్వకప్ చరిత్రలో నార్త్రన్ ఐర్లాండ్ ఆటగాడు నార్మన్ వైట్‌సైడ్ అత్యంత పిన్నవయస్కుడు. 1982 టోర్నీలో యుగోస్లేవియాతో మ్యాచ్‌లో తరఫున ఆడినప్పుడు అతడి వయసు 17 ఏళ్ల 41 రోజులు.
ఒక్క మ్యాచే ఆడారు..
టోర్నీ చరిత్రలో ఒక్క మ్యాచ్ ఆడిన జట్టుగా ఇండోనేసియా నిలిచింది. 1938లో ఫ్రాన్స్‌లో జరిగిన టోర్నీలో డచ్ ఈస్టిండీస్ పేరుతో ఆడింది. అప్పుడు రౌండ్-16 నుంచే వరల్డ్‌కప్ ఆరంభమయ్యేది. హంగేరి చేతిలో డచ్ ఈస్టిండీస్ ఓడి ఇంటిదారి పట్టింది.
పెద్దోడు
సాకర్ కప్‌లో ఆడిన అత్యంత పెద్దవయస్కుడిగా, కెప్టెన్‌గా ఈజిప్ట్ గోల్ కీపర్ ఎస్సామ్ ఎల్ హడారి రికార్డులకెక్కాడు. 2018లో రష్యాలో జరిగిన ఈవెంట్‌లో ఎస్సామ్ ఆడినప్పుడు అతడి వయసు 45 ఏళ్ల 161 రోజులు. ఈజిప్ట్ గ్రూప్ దశలోనే నిష్క్రమించినా.. ఎస్సామ్ మాత్రం చరిత్రలో నిలిచిపోయాడు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్