ఎంబాపె డబుల్
ABN , Publish Date - Jul 02 , 2026 | 05:40 AM
కిలియన్ ఎంబాపె డబుల్ ధమాకాతో.. ఫ్రాన్స్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. బుధవారం జరిగిన రౌండ్-32 మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0తో స్వీడన్‌ను చిత్తు చేసి పరాగ్వేతో పోరుకు సిద్ధమైంది. ఎంబాపె (45వ, 74వ నిమిషం), బ్రాడ్లీ బార్కోలా (53వ) గోల్స్ చేశారు...
ఫిఫా కప్ మ్యాచ్‌లు
అమెరికా X బోస్నియా
(ఉదయం 5.30)
స్పెయిన్ X ఆస్ట్రియా
(రాత్రి 12.30)
పోర్చుగల్ X క్రొయేషియా
(శుక్రవారం తెల్లవారుజాము 4.30)
ఎంబాపె గోల్ చేశాడిలా..
ప్రీక్వార్టర్స్‌కు ఫ్రాన్స్
3-0తో స్వీడన్‌పై ఘన విజయం
ఫిఫా వరల్డ్‌కప్ రౌండ్-32
రూథర్‌ఫోర్డ్: కిలియన్ ఎంబాపె డబుల్ ధమాకాతో.. ఫ్రాన్స్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. బుధవారం జరిగిన రౌండ్-32 మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0తో స్వీడన్‌ను చిత్తు చేసి పరాగ్వేతో పోరుకు సిద్ధమైంది. ఎంబాపె (45వ, 74వ నిమిషం), బ్రాడ్లీ బార్కోలా (53వ) గోల్స్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ .. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. పదేపదే స్వీడన్ గోల్ పోస్టుపై దాడులు చేసింది. 32వ నిమిషంలో ఎంబాపె కొట్టిన కిక్ గోల్ పోస్టును తాకి పక్కకు పోయింది. మరో నాలుగు నిమిషాల తర్వాత ఓలిస్ బైస్కిల్ కిక్ కూడా గోల్ పోస్టును తాకింది. రెండు గోల్స్ చేసే అవకాశం చేజారడంతో ఫ్రాన్స్ ఒకింత అసహనానికి గురైంది. అయితే, 45వ నిమిషంలో షార్ట్ కార్నర్ పాస్‌ను అందుకొన్న డెంబెలె.. బంతిని పెనాల్టీ ఏరియాలో ఉన్న ఎంబాపెకు అందించాడు. దీన్ని అతడు ఎంతో చాకచక్యంగా గోల్‌లోకి పంపి ఫ్రాన్స్‌ను 1-0 ఆధిక్యంలో నిలబెట్టాడు. ఇక, ద్వితీయార్థం 53వ నిమిషంలో లాంగ్ రేంజ్ నుంచి బార్కోలా బంతిని నేరుగా గోల్‌లోకి కొట్టాడు. ఆ తర్వాత 74వ నిమిషంలో ఎంబాపె రెండో గోల్‌తో మెరిశాడు.
మెస్సీతో హోరాహోరీ..
ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన ఎంబాపె.. మొత్తం 18 గోల్స్‌తో వరల్డ్‌క్‌పలో అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా అర్జెంటీనా గ్రేట్ మెస్సీకి గట్టిపోటీ ఇస్తున్నాడు. మెస్సీ 19 గోల్స్‌తో టాప్‌లో ఉన్నాడు.
40 ఏళ్ల నిరీక్షణకు తెర
నాకౌట్ మ్యాచ్‌లో మెరిసిన మెక్సికో
2-0తో ఈక్వెడార్‌పై గెలుపు
మెక్సికో సిటీ: సుదీర్ఘ నిరీక్షణకు ఆతిథ్య మెక్సికో ఎట్టకేలకు తెరదించింది. 40 ఏళ్ల తర్వాత నాకౌట్ మ్యాచ్‌లో నెగ్గింది. రౌండ్- 32లో మెక్సికో 2-0తో ఈక్వెడార్‌పై గెలిచి.. ప్రీక్వార్టర్స్‌కు చేరింది. జూలియన్ క్వినోనెస్ (22వ నిమిషం), రౌల్ జిమినెట్ (31వ) గోల్స్ చేసి మెక్సికోను 2-0 ఆధిక్యంలో నిలిపారు. జూలియన్ దూరం నుంచి కొట్టిన కిక్.. ఈక్వెడార్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ వెళ్లి గోల్‌లో పడింది. మరో 9 నిమిషాల తర్వాత జొమినెట్ బంతిని నెట్‌లోకి పంపి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.
1986లో స్వదేశంలో జరిగిన మెగా ఈవెంట్‌లో చివరిసారిగా రౌండ్-16లో బల్గేరియాపై మెక్సికో గెలిచింది. 1994 నుంచి 2018 వరకు ఏడుసార్లు నాకౌట్ దశలోనే ఇంటిముఖంపట్టగా.. 2022 టోర్నీలో గ్రూప్ దశను కూడా దాటలేదు.

కేన్ కమాల్
2-1తో ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విన్
వణికించిన కాంగో డీఆర్
అట్లాంటా: ఆరంభంలోనే గోల్ చేసిన పసికూన కాంగో డీఆర్ భయపెట్టినా.. చివర్లో 11 నిమిషాల తేడాతో కెప్టెన్ హ్యారీ కేన్ డబుల్ ధమాకాతో ఓటమి తప్పదనుకొన్న ఇంగ్లండ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకొంది. బుధవారం రాత్రి జరిగిన రౌండ్-32 మ్యాచ్‌లో 2-1తో కాంగో డీఆర్‌పై ఉత్కంఠ విజయం సాధించిన ఇంగ్లండ్.. ప్రీక్వార్టర్స్ బెర్త్‌ను దక్కించుకొంది. హ్యారీ కేన్ (75వ, 86వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. కాంగో తరఫున బ్రియాన్ సిపెంగ (7వ నిమిషం) గోల్ నమోదు చేశాడు.
1
ఐదు వరుస వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో మూడు అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన జట్టుగా ఫ్రాన్స్
ఇవి కూడా చదవండి:
ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!
శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్