Share News

‘ఆ నాలుగు’ ఓ రికార్డు

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:25 AM

ఫిఫా ప్రపంచ కప్‌ తుది దశకు వచ్చేసింది. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్‌, రెండో సెమీ్‌సలో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాతో ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. అయితే ఈ నాలుగు జట్లు...

‘ఆ నాలుగు’  ఓ రికార్డు

సెమీఫైనల్‌ షెడ్యూల్‌

ఫ్రాన్స్‌ X స్పెయిన్‌

(మంగళవారం అర్ధరాత్రి 12.30)

అర్జెంటీనా X ఇంగ్లండ్‌

(బుధవారం అర్ధరాత్రి 12.30)

ఫిఫా ప్రపంచ కప్‌ తుది దశకు వచ్చేసింది. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్‌, రెండో సెమీ్‌సలో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాతో ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. అయితే ఈ నాలుగు జట్లు సెమీస్‌ చేరడం ఓ చరిత్ర. ఎందుకంటే.. ఫిఫా వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా (1), ఫ్రాన్స్‌ (2), స్పెయిన్‌ (3), ఇంగ్లండ్‌ (4) తొలి నాలుగు స్థానాలలో ఉండడమే. 1992లో ఫిఫా పురుషుల జట్ల ర్యాంకింగ్స్‌ విధానాన్ని తీసుకొచ్చాక..ఇలా జరగడం ఇదే మొదటిసారి. గత మూడు దశాబ్దాలకు పైగా కాలంలో.. వరల్డ్‌ కప్‌ తుది దశ ఫలితాలను ఫిఫా ర్యాంకింగ్స్‌ ప్రతిబింబించడం చాలా అరుదుగా జరిగింది. అయితే 2002 టోర్నీలో సహ ఆతిథ్య జట్టు దక్షిణ కొరియా సెమీఫైనల్‌కు ప్రవేశించడం ఓ సంచలనం. కారణం..ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు 40వ స్థానంలో ఉండడం. ర్యాంకింగ్స్‌ ప్రవేశపెట్టాక..అత్యల్ప ర్యాంకులో ఉన్న ఓ జట్టు సెమీస్‌ రావడం అదే తొలిసారి. పోర్చుగల్‌, ఇటలీ, స్పెయిన్‌లాంటి టాప్‌ జట్లకు షాకిచ్చి కొరియా సెమీ్‌సకు దూసుకొచ్చింది. కానీ సెమీస్‌లో బలమైన బ్రెజిల్‌ చేతిలో ఓడింది. అలాగే 1994లో బల్గేరియా (29వ ర్యాంక్‌), 2002లో టర్కీ (22), 2018లో క్రొయేషియా (20), 2022లో మొరాకో (22) తమకంటే మెరుగైన ప్రత్యర్థులకు ఝలకిచ్చి సెమీస్‌ చేరిన జట్లుగా ప్రత్యేకత చాటుకున్నాయి.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఇవి కూడా చదవండి:

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!

Updated Date - Jul 13 , 2026 | 05:25 AM