Share News

విజేతలకు ఉంగరాలు

ABN , Publish Date - Jul 18 , 2026 | 05:29 AM

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారిగా విజేతలకు ఫిఫా ప్రత్యేకమైన ఉంగరాలను అందజేయనుంది...

విజేతలకు ఉంగరాలు

న్యూజెర్సీ: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారిగా విజేతలకు ఫిఫా ప్రత్యేకమైన ఉంగరాలను అందజేయనుంది. అమెరికాలో ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ చాంపియన్‌షిప్‌ నెగ్గిన ఆటగాళ్లకు ఇలా ప్రత్యేకమైన ఉంగరాలను ఇవ్వడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని ఇక్కడా పాటిస్తూ ఆటగాళ్లు, కోచ్‌లకు కలిపి 30 ఉంగరాలను విజేత జట్టుకు ఫిఫా బహూకరించనుంది. ఈ ఏడాది టోర్నీకి గుర్తుగా మొత్తం 2026 ఉంగరాలను సిద్ధం చేస్తున్నారు. వీటిలో విజేత జట్టుకు 30 పోగా, మిగిలిన 1996 ఉంగరాలను గుర్తింపు పొందిన సంస్థల ద్వారా ఫుట్‌బాల్‌ అభిమానులకు అందజేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్ 2026: ఫైనల్ మ్యాచ్‌కు డొనాల్డ్ ట్రంప్

లార్డ్స్‌కు రోహిత్ శర్మ తల్లిదండ్రులు.. రిటైర్‌మెంట్ వార్తల వేళ కీలక పరిణామం!

Updated Date - Jul 18 , 2026 | 05:29 AM