Share News

నయా హీరో

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:18 AM

టోర్నమెంట్‌ ఆసాంతం ఒక్క గోల్‌ కూడా చేయని 26 ఏళ్ల ఫెరాన్‌ టోరెస్‌ ఫైనల్లో మాత్రం అద్భుతంగా గోల్‌ కొట్టి స్పెయిన్‌ సరికొత్త హీరోగా...

నయా హీరో

టోర్నమెంట్‌ ఆసాంతం ఒక్క గోల్‌ కూడా చేయని 26 ఏళ్ల ఫెరాన్‌ టోరెస్‌ ఫైనల్లో మాత్రం అద్భుతంగా గోల్‌ కొట్టి స్పెయిన్‌ సరికొత్త హీరోగా అవతరించాడు. బార్సిలోనా క్లబ్‌ ఆటగాడైన టోరెస్‌ ఆరేళ్ల క్రితం స్పెయిన్‌ జాతీయ జట్టులో భాగమయ్యాడు. ఇప్పటిదాకా 64 మ్యాచుల్లో 25 గోల్స్‌ సాధించాడు. గత ప్రపంచక్‌పలోనూ గోల్‌ కొట్టాడు. కానీ, ఈసారి ఫైనల్‌ ప్రదర్శనతో అబ్బురపరిచాడు. ఆండ్రెస్‌ ఇనియెస్టా (2010లో) తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్లో గోల్‌ చేసిన స్పెయిన్‌ ఆటగాడిగా అరుదైన ఘనత అందుకున్నాడు. అన్నట్టు ఇతగాడు 17 ఏళ్ల వయసున్నప్పుడు భారత్‌ కూడా వచ్చాడు. 2017లో భారత్‌ వేదికగా జరిగిన ఫిఫా అండర్‌-17 ప్రపంచక్‌పలో స్పెయిన్‌ జట్టు రన్నర్‌పగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, టోరెస్‌ బర్త్‌డేను నాలుగేళ్లకోసారి జరుపుకొంటుంటాడు. ఎందుకంటే.. అతని పుట్టినరోజు ఫిబ్రవరి 29.

ఇవి కూడా చదవండి:

యమాల్ విజయం వెనుక నానమ్మ త్యాగం.. కష్టాల నుంచి ప్రపంచ స్టార్‌గా..!

రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన

Updated Date - Jul 21 , 2026 | 05:18 AM