ఫఖర్ జమాన్‌పై నిషేధం
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:11 AM
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎ్‌సఎల్)లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు ఆ దేశ క్రికెటర్ ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం...
కరాచీ: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎ్‌సఎల్)లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు ఆ దేశ క్రికెటర్ ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. గత ఆదివారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ కలందర్స్ ఆటగాడైన ఫఖర్ ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చినట్టు తేలింది. దీంతో లీగ్ లెవెల్ 3 నిబంధనను అతిక్రమించినందుకు అతడిపై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. టాంపరింగ్‌కు పాల్పడినట్టు తొలుత అతను ఒప్పుకోకపోయినా.. విచారణ కమిటీ వాస్తవాన్ని తేల్చింది.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్
బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత