Share News

ఇషాకు రజతం

ABN , Publish Date - May 30 , 2026 | 02:09 AM

షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో హైదరాబాద్‌ యంగ్‌ గన్‌ ఇషా సింగ్‌ మరో పతకాన్ని ముద్దాడింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పోటీలో...

ఇషాకు రజతం

మ్యూనిక్‌: షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో హైదరాబాద్‌ యంగ్‌ గన్‌ ఇషా సింగ్‌ మరో పతకాన్ని ముద్దాడింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పోటీలో ఇషా రజతంతో మెరిసింది. ఇషా 241.2 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలవగా, భారత్‌కే చెందిన సురుచి ఇందర్‌ సింగ్‌ 242.1 స్కోరుతో స్వర్ణం కైవసం చేసుకుంది. కొరియా షూటర్‌ చూ గైన్‌ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక, రెండ్రోజుల క్రితం ఇదే టోర్నీ 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో ఇషా ప్రపంచ రికార్డుతో స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

కేన్‌ విలియమన్స్‌ వరల్డ్ రికార్డ్

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Updated Date - May 30 , 2026 | 02:09 AM