చెలరేగిన బ్రూక్, రూట్
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:32 AM
శ్రీలంకతో జరిగిన ఆఖరి, మూడో వన్డేలో నెగ్గిన ఇంగ్లండ్ జట్టు సిరీ్‌సను 2-1తో కైవసం చేసుకుంది. హ్యారీ బ్రూక్ (66 బంతుల్లో 11 ఫోర్లు, 9 సిక్స్‌లతో 136 నాటౌట్), రూట్ (108 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్స్‌తో 111 నాటౌట్)...
ఆఖరి వన్డేలో ఇంగ్లండ్ విజయం
లంకపై 2-1తో సిరీస్ కైవసం
కొలంబో: శ్రీలంకతో జరిగిన ఆఖరి, మూడో వన్డేలో నెగ్గిన ఇంగ్లండ్ జట్టు సిరీ్‌సను 2-1తో కైవసం చేసుకుంది. హ్యారీ బ్రూక్ (66 బంతుల్లో 11 ఫోర్లు, 9 సిక్స్‌లతో 136 నాటౌట్), రూట్ (108 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్స్‌తో 111 నాటౌట్) శతకాలతో చెలరేగడంతో.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 357 పరుగులు చేసింది. ఛేదనలో పవన్ రత్నాయకే (121) శతకం చేసినా ఫలితం లేకపోయింది. పథుమ్ నిస్సంక 50 రన్స్ సాధించాడు. వీరిద్దరు మినహా మరెవ్వరూ పెద్ద స్కోరు చేయకపోవడం లంకను దెబ్బతీసింది. తుదకు లంక 46.4 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది.
ఇవి కూడా చదవండి:
'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్