Share News

రెండో టెస్ట్‌లోనూ పాక్‌ చిత్తు

ABN , Publish Date - Aug 31 , 2026 | 03:21 AM

పేసర్లు ఓలీ రాబిన్సన్‌ (4/24), జోష్‌ టంగ్‌ (3/46) నిప్పులు చెరగడంతో.. పాకిస్థాన్‌తో మూడు టెస్ట్‌ల...

రెండో టెస్ట్‌లోనూ పాక్‌ చిత్తు

2-0తో సిరీస్‌ ఇంగ్లండ్‌ వశం

లండన్‌: పేసర్లు ఓలీ రాబిన్సన్‌ (4/24), జోష్‌ టంగ్‌ (3/46) నిప్పులు చెరగడంతో.. పాకిస్థాన్‌తో మూడు టెస్ట్‌ల సిరీ్‌సను ఇంగ్లండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకొంది. రెండో టెస్ట్‌లో పాక్‌ను 194 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్‌ నాలుగో రోజే మ్యాచ్‌ను ముగించింది. 389 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ 194 పరుగులకే కుప్పకూలింది. సౌద్‌ షకీల్‌ (97) ఒంటరిపోరాటం చేశాడు. జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు దక్కించుకొన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 177/7తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇం గ్లండ్‌ 208 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 290, పాక్‌ 110 పరుగులు చేశాయి.

ఈ వార్తలు కూడా చదవండి

ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజా

Updated Date - Aug 31 , 2026 | 03:21 AM