Share News

మెస్సీ కోసం.. రిగ్గింగ్‌ చేశారు!

ABN , Publish Date - Jul 09 , 2026 | 02:44 AM

ప్రపంచ కప్‌లో మంగళవారం అర్జెంటీనాతో జరిగిన ప్రీక్వార్టర్స్‌ పోరులో ఈజిప్టు ఆటగాడు మొస్తఫా జికా 59వ నిమిషంలో కొట్టిన గోల్‌ను ఫౌల్‌గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది..

మెస్సీ కోసం.. రిగ్గింగ్‌ చేశారు!

  • ఫౌల్‌ గేమ్‌తో మమ్మల్ని ఓడించారు

  • ఈజిప్టు కోచ్‌ ఆరోపణలు

అట్లాంటా: ప్రపంచ కప్‌లో మంగళవారం అర్జెంటీనాతో జరిగిన ప్రీక్వార్టర్స్‌ పోరులో ఈజిప్టు ఆటగాడు మొస్తఫా జికా 59వ నిమిషంలో కొట్టిన గోల్‌ను ఫౌల్‌గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈజిప్టు కోచ్‌ హోస్సమ్‌ మ్యాచ్‌ తర్వాత సంచలన ఆరోపణలు చేశాడు. మ్యాచ్‌ అధికారులు పక్షపాతంతో వ్యవహరించారన్న హోస్సమ్‌.. మెస్సీని టోర్నీలో కొనసాగించడానికే ఇలా వ్యవహరించారని అన్నాడు. తమ ఓటమిని మైదానంలో ఆట కంటే బాహ్య అంశాలే ప్రభావితం చేశాయన్నాడు. ‘మా ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంది. కానీ, ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. సరిగా సమీక్షించకుండానే మా గోల్‌ను ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. కొన్ని నిర్ణయాలను బయటి శక్తులు ప్రభావితం చేశాయి. మెస్సీని టోర్నీలో చివరిదాకా ఆడించాలను కుంటున్నారు. అందుకే అర్జెంటీనాకు అనుకూలంగా రిగ్గింగ్‌ జరిగినట్టు అనిపిస్తోంది’ అని హొస్మస్‌ అన్నాడు. ఇక, విజేత ఎవరన్నది ముందుగానే ఫిక్స్‌ అయినట్టు అనిపిస్తోందని.. అర్జెంటీనాకే కప్పు ఇస్తారని ఈజిప్టు ఆటగాడు జికో ఆరోపించాడు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఎన్నికల్లో పెను సంచలనం.. డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాకు షాక్!

అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 09 , 2026 | 02:44 AM