Share News

ఈశ్వరి కొత్త చరిత్ర

ABN , Publish Date - Apr 09 , 2026 | 03:50 AM

భారత పారా స్విమ్మర్‌, దృష్టిలోపం ఉన్న 17 ఏళ్ల ఈశ్వరి పాండే స్విమ్మింగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది...

ఈశ్వరి కొత్త చరిత్ర

పాక్‌ జలసంధి ఈదిన తొలి అంధ స్విమ్మర్‌గా రికార్డు

చెన్నై (ఆంధ్రజ్యోతి): భారత పారా స్విమ్మర్‌, దృష్టిలోపం ఉన్న 17 ఏళ్ల ఈశ్వరి పాండే స్విమ్మింగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకలోని తలైమన్నార్‌ నుంచి భారత్‌లోని ధనుష్కోడి వరకు గల పాక్‌ జలసంధిని ఈదిన తొలి అంధ స్విమ్మర్‌గా ఈశ్వరి రికార్డుకెక్కింది. దాదాపు 30 కిలో మీటర్ల దూరాన్ని ఆమె 11 గంటలా 15 నిమిషాల వ్యవధిలో ఈదడం విశేషం. మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఈశ్వరి పుట్టుకతోనే అంధురాలైనా.. అపారమైన ధైర్య సాహసాలతో ఈ అద్భుత ప్రదర్శన చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి:

ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య

Updated Date - Apr 09 , 2026 | 03:50 AM