Share News

జర్మనీకి ఈక్వె‘డర్‌’

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:03 AM

ర్యాంకుల్లో తన కంటే తక్కువ స్థాయి జట్ల చేతుల్లోనే నెగ్గలేకపోయింది.. దరిమిలా ప్రమాదంలో పడిన నాకౌట్‌ బెర్త్‌.. ఈ నేపథ్యంలో నాలుగుసార్లు చాంపియన్‌ జర్మనీని అడ్డుకోవడం దుర్లభమని, ఇక ఇంటిముఖం తప్పదని...

జర్మనీకి ఈక్వె‘డర్‌’

ఫిఫా కప్‌ మ్యాచ్‌లు

సౌదీ అరేబియా X కేప్‌ వెర్డె

(ఉదయం 5.30)

స్పెయిన్‌ X ఉరుగ్వే (ఉ.5.30)

బెల్జియం X న్యూజిలాండ్‌

( ఉదయం 8.30)

ఈజిప్టు X ఇరాన్‌ (ఉ.8.30)

ఇంగ్లండ్‌ X పనామా

(ఆదివారం తెల్లవారుజాము 2.30)

క్రొయేషియా X ఘనా

(ఆదివారం తెల్లవారుజాము 2.30)

మాజీ విజేతకు ఈక్వెడార్‌ షాక్‌

నాకౌట్‌లో ప్రవేశం

ర్యాంకుల్లో తన కంటే తక్కువ స్థాయి జట్ల చేతుల్లోనే నెగ్గలేకపోయింది.. దరిమిలా ప్రమాదంలో పడిన నాకౌట్‌ బెర్త్‌.. ఈ నేపథ్యంలో నాలుగుసార్లు చాంపియన్‌ జర్మనీని అడ్డుకోవడం దుర్లభమని, ఇక ఇంటిముఖం తప్పదని ఈ పోరుకు ముందు ఆ జట్టుపై వెలువడిన అంచనాలు..కానీ ఆ విశ్లేషణలను పటాపంచలు చేసింది.. ప్రత్యర్థికి షాకిచ్చి సగర్వంగా తదుపరి రౌండ్‌కు చేరింది ఈక్వెడార్‌.

ఈస్ట్‌రూథర్‌ఫోర్డ్‌ (యూఎస్‌): వింగర్‌ గొంజాలెజ్‌ ప్లాటా మాయ చేశాడు. ఆశలు వదులుకొన్న చోట అద్భుతం సృష్టించాడు. 77వ నిమిషంలో గోల్‌ చేసి యావత్‌ ఈక్వెడార్‌ను ఆనంద డోలికల్లో ముంచెత్తాడు. దాంతో ఫిఫా వరల్డ్‌ కప్‌లో భాగంగా గ్రూప్‌ ‘ఇ’లో జరిగిన కీలక మ్యాచ్‌లో ఈక్వెడార్‌ 2-1తో పటిష్టమైన జర్మనీకి ఝలకిచ్చి నాకౌట్‌కు చేరింది. అంతకుముందు జర్మనీ తరఫున ఏకైక గోల్‌ను లెరాయ్‌ సనే రెండో నిమిషంలోనే చేశాడు. ఈక్వెడార్‌ జట్టులో మరో గోల్‌ను నిల్సన్‌ అంగ్యులో తొమ్మిదో నిమిషంలో సాధించాడు. కాగా.. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన జర్మనీ గ్రూప్‌ టాపర్‌గా ఇప్పటికే రౌండ్‌-32లో ప్రవేశించింది. గ్రూప్‌ రన్నర్‌పగా ఐవరికోస్ట్‌ కూడా తదుపరి దశకు ముందంజ వేసింది. ఇక మూడో అత్యుత్తమ స్థానం సాధించిన ఈక్వెడార్‌ కూడా నాకౌట్‌లో అడుగుపెట్టింది. ఈక్వెడార్‌ ఈ దశకు చేరడం ఇది రెండోసారి. 2006లో కూడా ఆ జట్టు రౌండ్‌-32కి ముందంజ వేసింది.


3-Sports.jpg

‘టాప్‌’ లేపిన నెదర్లాండ్స్‌

గ్రూప్‌ ‘ఎఫ్‌’ టాపర్‌గా నెదర్లాండ్స్‌ జట్టు నాకౌట్‌లో అడుగుపెట్టింది. నెదర్లాండ్స్‌ 3-1తో ట్యునీసియాను ఓడించింది. బ్రియాన్‌ బాబీ (7వ నిమిషం), జాన్‌ పాల్‌ వాన్‌ హెక్‌ (62వ) నెదర్లాండ్స్‌కు గోల్స్‌ చేశారు. ట్యునీసియా ఆటగాడు ఎలీస్‌ ఖిరి (3వ) సెల్ప్‌గోల్‌తో నెదర్లాండ్స్‌కు మూడో గోల్‌ లభించింది. హాజెమ్‌ మస్తౌరి (54ని.) ట్యునీసియాకు ఏకైక గోల్‌ అందించాడు. అర్లింగ్టన్‌లో జరిగిన ఇదే గ్రూప్‌ మ్యాచ్‌లో జపాన్‌, స్వీడన్‌ పోరు 1-1తో డ్రాగా ముగిసింది. డైజెన్‌ (56వ ని.) జపాన్‌కు, ఆంధోనీ (62వ ని.) స్వీడన్‌కు గోల్స్‌ చేశారు. నెదర్లాండ్స్‌తోపాటు, జపాన్‌, స్వీడన్‌ కూడా తదుపరి రౌండ్‌కు చేరాయి.

తుర్కియే చేతిలో అమెరికా బోల్తా

గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో తుర్కియే 3-2తో ఆతిథ్య అమెరికాకు షాకిచ్చింది. ఆస్టన్‌ (3వ) సెబాస్టియన్‌ (49వ) అమెరికాకు గోల్స్‌ చేశారు. అర్డా (10వ), బారిస్‌ (31వ), కాన్‌ (90+8) తుర్కియేకు గోల్స్‌ అందించారు.

ఐవరికోస్ట్‌ తొలిసారి..

ఐవరికోస్ట్‌ జట్టు ప్రపంచ కప్‌లో తొలిసారి నాకౌట్‌కు చేరింది. గ్రూప్‌ ‘ఇ’లో ఫిలడెల్ఫియాలో జరిగిన మ్యాచ్‌లో ఐవరికోస్ట్‌ 2-0తో కురకావోపై గెలిచింది. నికొలాస్‌ పెపె రెండు గోల్స్‌తో అదరగొట్టాడు.

ఆస్ట్రేలియా ముందంజ

గ్రూప్‌ ‘డి’లో ఆస్ట్రేలియా-పరాగ్వే మ్యాచ్‌ 0-0తో ఫలితం తేలకుండా ముగిసింది. డ్రా చేసుకున్నా ఆస్ట్రేలియా జట్టు నాకౌట్‌కు చేరింది. ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన అమెరికా ఇప్పటికే రౌండ్‌-32లో అడుగుపెట్టగా..రెండో స్థానంతో ఆస్ట్రేలియా ముందంజ వేసింది. మూడో అత్యుత్తమ జట్టుగా పరాగ్వే తదుపరి దశకు చేరే చాన్సుంది.

ఇవి కూడా చదవండి

విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..

IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

Updated Date - Jun 27 , 2026 | 06:04 AM