ఇరాన్ ఆడదా..! ‘ఐ డోంట్‌కేర్’
ABN , Publish Date - Mar 05 , 2026 | 05:22 AM
ప్రపంచ కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌పలో ఇరాన్ పాల్గొనకుంటే వచ్చే నష్టమేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు....
ఫిఫా వరల్డ్ కప్‌పై ట్రంప్
వాషింగ్టన్ (డీసీ): ప్రపంచ కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌పలో ఇరాన్ పాల్గొనకుంటే వచ్చే నష్టమేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరిగే మెగా టోర్నమెంట్‌కు అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ప్రస్తుతం తమపై అమెరికా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్‌ను తాము బహిష్కరించనున్నట్టు ఇరాన్ సంకేతమిచ్చింది. ఈ విషయమై ట్రంప్ స్పందిస్తూ ‘ఫిఫా ప్రపంచ కప్‌లో ఇరాన్ పాల్గొనకపోవడాన్ని నేను అస్సలు పట్టించుకోను. ఇరాన్ ఘోరంగా ఓడిపోయే దేశమని నేను అనుకుంటున్నా’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ వ్యూయర్ షిప్‌లో సంచలన రికార్డ్!
ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ పోరు