పెద్దోడా.. చిన్నోడా?
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:26 AM
టెన్ని్‌సలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉన్న సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్.. ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో...
మ. 2 గం. నుంచి
సోనీ నెట్‌వర్క్‌లో
జొకోవిచ్‌గీ అల్కారజ్
పురుషుల ఫైనల్ నేడు
టెన్ని్‌సలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉన్న సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్.. ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో టాప్‌సీడ్ కార్లోస్ అల్కారజ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్‌లు ఖాతాలో వేసుకున్న నొవాక్.. ఆల్‌టైమ్ గ్రేట్ మార్గరెట్ కోర్ట్‌తో సమంగా ఉన్నాడు. మరో టైటిల్ నెగ్గితే.. 25 గ్రాండ్‌స్లామ్‌లు సొంతం చేసుకొన్న ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు అందుకుంటాడు. అంతేకాదు.. ఈ ట్రోఫీతో ఓపెన్ ఎరాలో గ్రాండ్‌స్లామ్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా 38 ఏళ్ల జొకోవిచ్ నయా చరిత్ర సృష్టిస్తాడు. ఇక.. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ నెగ్గిన 22 ఏళ్ల అల్కారజ్.. ఇక్కడ గెలిస్తే కెరీర్ స్లామ్ (కెరీర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గడం) సాధించిన పిన్న వయసు ఆటగాడిగా ఘనత వహిస్తాడు. మరి.. చర్రితకెక్కేది పెద్దోడా..? చిన్నోడా..? చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్
టీ20 ప్రపంచ కప్ 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు