ధీరజ్ జోడీ చేజారిన కాంస్యం
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:52 AM
తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4 పోటీల్లో కొద్దిలో కాంస్య పతకం చేజార్చుకున్నాడు...
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4
మాడ్రిడ్: తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4 పోటీల్లో కొద్దిలో కాంస్య పతకం చేజార్చుకున్నాడు. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కీర్తి శర్మతో కలిసి బరిలోకి దిగిన ధీరజ్.. కాంస్యం పోరులో ప్రత్యర్థిపై 3-1తో ఆధిక్యంలో ఉండి కూడా విజయం సాధించలేకపోవడం గమనార్హం. ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో ధీరజ్/కీర్తి ద్వయం 3-5తో ఇటలీకి చెందిన రోబర్టా డి ఫ్రాన్సెస్కో/మాథ్యూ బోర్సాని జంట చేతిలో ఓటమిపాలైంది. ఇక, మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం కాంస్య పోరులోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. జపాన్ ఆర్చర్ యెజిన్ 7-1తో భారత్‌కు చెందిన కీర్తి శర్మను ఓడించి పతకం అందుకుంది.
ఇవి కూడా చదవండి:
నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!
భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!