Share News

దేవికకు ‘అజర్‌బైజాన్‌’ టైటిల్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 05:40 AM

గతవారం థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌లో విజేతగా నిలిచి సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్‌ దేవికా సిహాగ్‌.. వరుసగా రెండో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది...

దేవికకు ‘అజర్‌బైజాన్‌’ టైటిల్‌

మిక్స్‌డ్‌ విజేత సాత్విక్‌ జోడీ

న్యూఢిల్లీ: గతవారం థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌లో విజేతగా నిలిచి సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్‌ దేవికా సిహాగ్‌.. వరుసగా రెండో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఆదివారం బాకు వేదికగా జరిగిన అజర్‌బైజాన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్‌ ఫైనల్లో దేవిక 21-10, 21-13తో సహచర షట్లర్‌ నవ్య కందేరిని ఓడించి ట్రోఫీ అందుకుంది. ఇక, తెలుగు షట్లర్‌ సాత్విక్‌ రెడ్డి/రాధిక శర్మ జోడీ 24-22, 10-21, 24-22తో సెర్బియా జంట మిహాలో/విట్‌మాన్‌పై నెగ్గి మిక్స్‌డ్‌ డబుల్స్‌ ట్రోఫీ దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

Updated Date - Feb 09 , 2026 | 05:40 AM