Shubman Gill T20 World Cup: విధిరాత ఎలావుంటే.. అలా
ABN , Publish Date - Jan 11 , 2026 | 05:28 AM
టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కకపోవడం వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను నిర్వేదానికి గురిచేసినట్టు కనిపిస్తోంది....
వడోదర: టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కకపోవడం వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను నిర్వేదానికి గురిచేసినట్టు కనిపిస్తోంది. ‘నా జీవితంలో ఎక్కడ ఉండాలని రాసిపెట్టివుందో అక్కడే ఉన్నానని నమ్ముతున్నా. దానిని ఎవరూ నా నుంచి లాక్కోలేరు’ అని న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ముందు శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గిల్ వ్యాఖ్యానించాడు. టెస్ట్‌లు, వన్డేలలో జట్టును ప్రశంసనీయంగా నడిపిస్తున్న 26 ఏళ్ల గిల్‌ను వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని, పొట్టి ఫార్మాట్‌లో అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్
కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్