Denmarks Mia Blichfeld Voices: ఇవేం ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:09 AM
ఇండియా ఓపెన్ ఏర్పాట్లపై సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసిన డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్‌ఫెల్డ్ మరోసారి విమర్శలు...
కెనడా షట్లర్ బ్లిచ్‌ఫెల్డ్ అసహనం
ఇండియా ఓపెన్ ఏర్పాట్లపై సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసిన డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్‌ఫెల్డ్ మరోసారి విమర్శలు చేసింది. కేడీ జాదవ్ స్టేడియం నుంచి ఇందిరాగాంధీ స్టేడియానికి వేదికను మార్చినా పరిస్థితులు మెరుగవలేదని ఆరోపించింది. ప్రధాన పోటీలు జరుగుతున్న కోర్టులు బాగానే ఉన్నా, ప్రాక్టీసు కోర్టుల దగ్గర పక్షులు తిరుగుతున్నాయని, అక్కడ వాటి విసర్జనాలు దర్శనమిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సాధన చేస్తే షట్లర్లు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె విమర్శలను జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య కార్యదర్శి సంజయ్ మిశ్రా కొట్టిపారేశారు.
ఇవి కూడా చదవండి:
ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్
రో-కో నన్ను ‘చోటా చీకూ’ అని పిలిచారు: విరాట్ పోలికలతో ఉన్న బాలుడు