Share News

సింధు, లక్ష్య సేన్‌కు షాక్‌

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:08 AM

డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌కు తొలి రౌండ్‌లోనే షాక్‌ తగలగా.. తన్వీ శర్మ, కిడాంబి శ్రీకాంత్‌ ముందంజ వేశారు...

సింధు, లక్ష్య సేన్‌కు షాక్‌

ప్రీక్వార్టర్స్‌కు తన్వీ, శ్రీకాంత్‌

  • డెన్మార్క్‌ ఓపెన్‌

ఒడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌కు తొలి రౌండ్‌లోనే షాక్‌ తగలగా.. తన్వీ శర్మ, కిడాంబి శ్రీకాంత్‌ ముందంజ వేశారు. మంగళవారం జరిగిన రౌం డ్‌-32లో సింధు 21-13, 23-25, 19-21తో యోన్నీ లీ (జర్మనీ) చేతిలో ఓడింది. అయితే, తన్వీ 21-17, 16-21, 21-19తో నట్సుకి నిడైరా (జపాన్‌)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకొంది. పురుషుల సింగిల్స్‌లో వెటరన్‌ శ్రీకాంత్‌ 22-20, 21-19తో మెర్క్‌లీ (ఫ్రాన్స్‌)పై పోరాడి నెగ్గగా.. లక్ష్యసేన్‌ 18-21, 21-13, 15-21తో మూడో సీడ్‌ చౌ టిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు.

ఇవి కూడా చదవండి:

బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!

ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

Updated Date - Oct 14 , 2026 | 06:08 AM