Share News

Womens Premier League 2026: ఢిల్లీ బోణీ

ABN , Publish Date - Jan 15 , 2026 | 06:01 AM

Delhi Capitals Open Account with 7 Wicket Win Over UP Warriors in WPL Thriller

Womens Premier League 2026: ఢిల్లీ బోణీ

మూడో మ్యాచ్‌లోనూ యూపీకి నిరాశ

నవీ ముంబై: రెండు జట్లు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడాయి. దాంతో ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకమైంది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలో దిగాయి. దాంతో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మ్యాచ్‌లో చివరకు యూపీ వారియర్స్‌పై 7 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలిచింది. పాయింట్ల ఖాతా తెరిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత యూపీ 20 ఓవర్లలో 154/8 స్కోరు చేసింది. మెగ్‌లానింగ్‌ (54) హాఫ్‌ సెంచరీ చేయగా, హర్లీన్‌ డియోల్‌ (36 బంతుల్లో 7 ఫోర్లతో 47) రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగింది. లిచ్‌ఫీల్డ్‌ (27) మోస్తరుగా ఆడింది. షషాలీ, కాప్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 158/3 స్కోరుతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. లిజెల్లీ లీ (67), షఫాలీ (36), వోల్వార్ట్‌ (25 నాటౌట్‌) రాణించారు. దీప్తీశర్మ 2 వికెట్లు తీసింది.

హర్లీన్‌ అసంతృప్తి: స్కోరులో వేగం పెంచేందుకు 17వ ఓవర్‌ పూర్తి కాగానే యూపీ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌.. హర్లీన్‌ను రిటైర్డ్‌ అవుట్‌గా రావాలంటూ డగౌట్‌ నుంచి సంజ్ఞ చేశాడు. అప్పటికి బాగానే ఆడుతున్న హర్లీన్‌ ఫిఫ్టీకి 3 పరుగుల దూరంలో ఉంది. ఈ దశలో కోచ్‌ తనను రిటైర్డ్‌ అవుట్‌గా రావాలని కోరడంతో హర్లీన్‌ అసంతృప్తి ప్రకటిస్తూ వెనుదిరిగింది. ఆ తర్వాత చివరి 18 బంతుల్లో జట్టు 4 వికెట్లు కోల్పోయి 13 రన్సే చేసింది.


సంక్షిప్తస్కోర్లు

యూపీ: 20 ఓవర్లలో 154/8 (లానింగ్‌ 54, హర్లీన్‌ రిటైర్డ్‌ హర్ట్‌ 47, లిచ్‌ఫీల్డ్‌ 27, షఫాలీ 2/16, కాప్‌ 2/24).

ఢిల్లీ: 20 ఓవర్లలో 158/3 (లిజెల్లీ లీ 67, షఫాలీ 36, వోల్వార్ట్‌ 25 నాటౌట్‌, జెమీమా 21, దీప్తీశర్మ 2/26).

డబ్ల్యూపీఎల్‌ షెడ్యూల్‌

నేడు : ముంబై గీయూపీ (రా. 7.30)

రేపు: గుజరాత్‌ గీబెంగళూరు (రా. 7.30)

ఇవీ చదవండి

ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్

జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

Updated Date - Jan 15 , 2026 | 06:01 AM