ఆర్‌సీబీకి ఢిల్లీ ఝలక్
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:24 AM
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్లతో ఆర్‌సీబీకి షాకిచ్చింది...
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్లతో ఆర్‌సీబీకి షాకిచ్చింది. వరుసగా ఐదు విజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్‌సీబీకిది తొలి ఓటమి. అటు ఢిల్లీ 6 పాయింట్లు, మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానానికి చేరింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. 15 రన్స్ వ్యవధిలోనే చివరి 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ స్మృతీ మంధాన (38), రాధా యాదవ్ (18) మాత్రమే రాణించారు. నందని శర్మకు మూడు.. మరిజానె కాప్, మిన్ను, హెన్రీలకు రెండేసి వికెట్లు దక్కాయి. స్వల్ప ఛేదనలో ఢిల్లీ 15.4 ఓవర్లలో 111/3 స్కోరు చేసి నెగ్గింది. వోల్వార్ట్ (42 నాటౌట్), సారథి జెమీమా (24), కాప్ (19 నాటౌట్), షఫాలీ (16) ఆకట్టుకున్నారు. సయాలికి 2 వికెట్లు లభించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా కాప్ నిలిచింది.
సంక్షిప్త స్కోర్లు: బెంగళూరు: 20 ఓవర్లలో 109 ఆలౌట్ (మంధాన 38, రాధా 18; నందని 3/26, కాప్ 2/17, మిన్ను 2/18, హెన్రీ 2/22).
ఢిల్లీ: 15.4 ఓవర్లలో 111/3 (వోల్వార్ట్ 42 నాటౌట్, జెమీమా 24, కాప్ 19 నాటౌట్; సయాలి 2/18).
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ
ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్