Share News

వావ్‌.. మిల్లర్‌

ABN , Publish Date - Apr 19 , 2026 | 04:47 AM

నరాలు తెగే ఉత్కంఠ మధ్య డేవిడ్‌ మిల్లర్‌ (10 బంతుల్లో ఓ ఫోర్‌, 2 సిక్సర్లతో 22 నాటౌట్‌) ఆఖర్లో రెండు సిక్స్‌లు బాదడంతో.. శనివారం ఇక్కడ హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో...

వావ్‌.. మిల్లర్‌

మహిళల రెండో టీ20 నేడు

భారత్‌ X దక్షిణాఫ్రికా (సా. 5.30)

ఢిల్లీ థ్రిల్లింగ్‌ విన్‌

  • అదరగొట్టిన స్టబ్స్‌, రాహుల్‌

  • బెంగళూరుకు నిరాశ

  • సాల్ట్‌ అర్థ శతకం వృథా

బెంగళూరు: నరాలు తెగే ఉత్కంఠ మధ్య డేవిడ్‌ మిల్లర్‌ (10 బంతుల్లో ఓ ఫోర్‌, 2 సిక్సర్లతో 22 నాటౌట్‌) ఆఖర్లో రెండు సిక్స్‌లు బాదడంతో.. శనివారం ఇక్కడ హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్లతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)ను ఓడించింది. తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 175/8 స్కోరు చేసింది. ఓపెనర్‌ సాల్ట్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 63) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అక్షర్‌, కుల్దీప్‌, ఎన్‌గిడి తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఢిల్లీ 19.5 ఓవర్లలో 179/4 స్కోరు చేసి గెలిచింది. పేసర్‌ భువనేశ్వర్‌ (3/26) దెబ్బకు.. 18/3తో ఢిల్లీ ఇబ్బందుల్లో పడిన తరుణంలో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (47 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 నాటౌట్‌) నాలుగో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. హాఫ్‌ సెంచరీ చేసిన రాహుల్‌ను క్రునాల్‌ అవుట్‌ చేశాడు. కానీ, కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (26 రిటైర్డ్‌ హర్ట్‌)తో కలసి స్టబ్స్‌ ఐదో వికెట్‌కు అజేయంగా 47 పరుగులు జోడించి జట్టు ఆశలను సజీవంగా ఉంచాడు. కండరాలు పట్టేడయంతో అక్షర్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగినా.. మిల్లర్‌తో కలసి స్టబ్స్‌ ఆరో వికెట్‌కు అభేద్యంగా 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో క్యాపిటల్స్‌ మరో బంతి మిగిలుండగానే గెలుపు గీత దాటింది. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 15 రన్స్‌ కావాల్సి ఉండగా.. గుజరాత్‌తో మ్యాచ్‌లో 2 బంతుల్లో 2 పరుగులు చేయడంలో విఫలమైన మిల్లర్‌ ఈసారి తన సత్తాచాటి జట్టును గెలిపించాడు. స్టబ్స్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.


స్కోరుబోర్డు

బెంగళూరు: సాల్ట్‌ (సి) స్టబ్స్‌ (బి) కుల్దీప్‌ 63, కోహ్లీ (సి) నిస్సాంక (బి) ఎన్‌గిడి 19, పడిక్కల్‌ (సి) మిల్లర్‌ (బి) అక్షర్‌ 18, రజత్‌ పటీదార్‌ (సి) రాహుల్‌ (బి) ముకేశ్‌ 8, డేవిడ్‌ (సి) నటరాజన్‌ (బి) అక్షర్‌ 26, జితేశ్‌ (సి) మిల్లర్‌ (బి) ఎన్‌గిడి 14, షెపర్డ్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 1, క్రునాల్‌ (రనౌట్‌) 12, రసిక్‌ (నాటౌట్‌) 0, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 175/8; వికెట్ల పతనం: 1-52, 2-99, 3-105, 4-131, 5-146, 6-149, 7-172, 8-172; బౌలింగ్‌: నబీ 3-0-36-0, ముకేశ్‌ 4-0-32-1, ఎన్‌గిడి 4-0-39-2, కుల్దీప్‌ 4-0-32-2, నటరాజన్‌ 2-0-16-0, అక్షర్‌ 3-0-18-2.

ఢిల్లీ: నిస్సాంక (ఎల్బీ) భువనేశ్వర్‌ 1, రాహుల్‌ (సి) కోహ్లీ (బి) క్రునాల్‌ 57, నాయర్‌ (సి) సాల్ట్‌ (బి) భువనేశ్వర్‌ 5, రిజ్వీ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 2, స్టబ్స్‌ (నాటౌట్‌) 60, అక్షర్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 26, మిల్లర్‌ (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19.5 ఓవర్లలో 179/4; వికెట్ల పతనం: 1-2, 2-16, 3-18, 4-87; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-26-3, హాజెల్‌వుడ్‌ 4-0-38-0, రసిక్‌ సలామ్‌ 4-0-40-0, క్రునాల్‌ 4-0-24-1, సుయాష్‌ 3-0-31-0, షెపర్డ్‌ 0.5-0-17-0.

ఇవి కూడా చదవండి:

అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్

ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!

Updated Date - Apr 19 , 2026 | 04:47 AM