Share News

8 నెలల గర్భంతో మారథాన్‌

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:02 AM

డీర్‌డ్రే కేన్‌..38 ఏళ్ల ఈమె ఓ నర్సు. అయితే ఏమిటి అనేగా మీ డౌట్‌. న్యూయార్క్‌కు చెందిన కేన్‌ కెరీర్‌లో ఇప్పటికే 60కి పైగా...

8 నెలల గర్భంతో మారథాన్‌

న్యూయార్క్‌: డీర్‌డ్రే కేన్‌..38 ఏళ్ల ఈమె ఓ నర్సు. అయితే ఏమిటి అనేగా మీ డౌట్‌. న్యూయార్క్‌కు చెందిన కేన్‌ కెరీర్‌లో ఇప్పటికే 60కి పైగా మారథాన్‌ పరుగుల్లో పోటీపడింది. అది కూడా కాదు ప్రత్యేకం. గర్భవతిగా ఆమె ఈ ఏడాది ఏడు మారథాన్‌ రేస్‌లను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. ఇటీవలి న్యూ యార్క్‌ మారథాన్‌లో పాల్గొన్నప్పుడు కేన్‌ 34 వారాల గర్భవతి..అంటే 8 నెలలు! ఏప్రిల్‌లో లండన్‌ మారథాన్‌ పూర్తయ్యాక ఆమె 6 వారాల గర్భవతని తెలిసింది. అయినా వెనుకడుగు వేయలేదు. డాక్టర్ల అనుమతి తీసుకొని సిడ్నీ, బెర్లిన్‌, షికాగో మారథాన్‌లలో పాల్గొంది. అంతకుముందు..బోస్టన్‌, టోక్యో మారథాన్‌ల బరిలో దిగినా..అప్పటికి తాను గర్భవతినని డీర్‌ డ్రేకి తెలియదట!

ఇవి కూడా చదవండి:

భారత్‌తో టెస్టు మ్యాచ్: ముగిసిన తొలి రోజు ఆట.. కివీస్ స్కోర్ 243/5

టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..

Updated Date - Nov 20 , 2026 | 04:02 AM