డేవిస్ కప్ పోరుకు యుకీ దూరం!
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:14 AM
డేవిస్ కప్‌లో దక్షిణ కొరియాతో కీలక పోరు ప్రారంభానికి ముందే భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది...
న్యూఢిల్లీ: డేవిస్ కప్‌లో దక్షిణ కొరియాతో కీలక పోరు ప్రారంభానికి ముందే భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. జట్టులోని ప్రధాన ఆటగాడు, డబుల్స్ స్టార్ యుకీ భాంబ్రీ గాయంతో డేవిస్ కప్‌కు దూరమైనట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా భాంబ్రీ కుడి మోకాలికి గాయమైంది. దీంతో అతను జట్టు నుంచి దాదాపు తప్పుకొన్నట్టేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు టోర్నీ వేదికైన సియోల్ నగరానికి గురువారం రాత్రి వెళ్లిన తొలి విడత భారత జట్టు సభ్యుల బృందంలో యుకీ లేకపోవడం గమనార్హం. కొరియాతో భారత్ డేవిస్ కప్ పోరు ఈనెల 18, 19వ తేదీల్లో జరగనుంది. యుకీ దూరమైతే, అతని స్థానంలో శ్రీరామ్ బాలాజీతో పాటు సింగిల్స్ స్పెషలిస్టు దక్షిణేశ్వర్‌తో ఆడించొచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం