Damien Martin: అద్భుతం.. మార్టిన్ కోలుకున్నాడు
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:58 AM
తన సహచరుడు డేమియన్ మార్టిన్ కోలుకున్నాడని ఆస్ట్రేలియా మాజీ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ వెల్లడించాడు. ‘గత 48 గంటల్లో అద్భుతం జరిగింది...
మెల్‌బోర్న్: తన సహచరుడు డేమియన్ మార్టిన్ కోలుకున్నాడని ఆస్ట్రేలియా మాజీ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ వెల్లడించాడు. ‘గత 48 గంటల్లో అద్భుతం జరిగింది. చికిత్సకు మార్టిన్ స్పందిస్తున్నాడు. అతడు మాట్లాడగలుగుతున్నాడు’ అని తెలిపాడు. మెదడువాపు వ్యాధి బారిన పడిన 54 ఏళ్ల ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మార్టిన్‌ను ఇక్కడి ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఈ వ్యాధితో అతడి మెదడు, ఇతర అవయవాలు దెబ్బతినకుండా ఉండేందుకు మార్టిన్‌ను డాక్టర్లు తాత్కాలికంగా కోమాలోకి పంపిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్
T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు!