చెక్‌కు నిరాశ
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:20 AM
ఆఖరి నిమిషాల్లో ఫౌల్ కారణంగా.. చెక్‌కు గెలుపు చేజారింది. గ్రూప్-ఎలో గురువారం చెక్ రిపబ్లిక్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్...
సౌతాఫ్రికాతో మ్యాచ్ డ్రా
అట్లాంటా: ఆఖరి నిమిషాల్లో ఫౌల్ కారణంగా.. చెక్‌కు గెలుపు చేజారింది. గ్రూప్-ఎలో గురువారం చెక్ రిపబ్లిక్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ 1-1తో డ్రా అయింది. చెక్ తరఫున మిచెల్ సాడిలెక్ (6వ నిమిషం) గోల్ చేయగా.. సౌతాఫ్రికా ఆటగాడు మొకోయన (83వ) పెనాల్టీని గోల్‌గా మలిచాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన చెక్.. ఫస్టా్‌ఫలో బంతిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ క్రమంలో ఆరో నిమిషంలో పాస్‌ను అందుకొన్న సాడిలెక్ నేరుగా కొట్టిన కిక్ గోల్‌లో పడడంతో చెక్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక 81వ నిమిషంలో చెక్ పెనాల్టీ ఏరియాలో పావెల్ సల్క్ చేతికి బంతి తగలడంతో.. సౌతాఫ్రికాకు పెనాల్టీ కిక్ ఇచ్చారు. దీన్ని టెబోకో గోల్‌గా మలచడంతో స్కోర్లు సమమయ్యాయి.
ఇవీ చదవండి:
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!
జులన్ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ