Share News

చెన్నైకి ఝలక్‌

ABN , Publish Date - May 16 , 2026 | 03:01 AM

ప్లేఆఫ్స్‌ బెర్త్‌పై గంపెడాశలు పెట్టుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 90) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో...

చెన్నైకి ఝలక్‌

నేటి మ్యాచ్‌

కోల్‌కతా X గుజరాత్‌

వేదిక : కోల్‌కతా, రా.7.30

ప్రమాదంలో ప్లేఆఫ్స్‌ బెర్త్‌

  • 7 వికెట్లతో లఖ్‌నవూ ఘనవిజయం

  • చెలరేగిన మిచెల్‌ మార్ష్‌ (38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 90)

లఖ్‌నవూ: ప్లేఆఫ్స్‌ బెర్త్‌పై గంపెడాశలు పెట్టుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 90) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో శుక్రవారం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. లఖ్‌నవూ ఇప్పటికే రేసు నుంచి దూరమైన విషయం తెలిసిందే. అయితే సీఎ్‌సకే ప్రస్తుతం 12 పాయింట్లతో ఉండగా, మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాల్సిందే. అదే సమయంలో తమకు పోటీగా ఉన్న ప్రత్యర్థులు ఓడితేనే చెన్నై ముందుకెళుతుంది. ముందుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. కార్తీక్‌ శర్మ (42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 71), శివమ్‌ దూబే (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్‌), బ్రెవిస్‌ (16 బంతుల్లో 2 సిక్సర్లతో 25) రాణించారు. ఆకాశ్‌ సింగ్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో లఖ్‌నవూ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు చేసి గెలిచింది. ఇన్‌గ్లి్‌స (32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 36), పూరన్‌ (17 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 32 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా మార్ష్‌ నిలిచాడు.

మార్ష్‌ వీరంగం: ఈ పిచ్‌పై చెన్నై సవాల్‌ విసిరే స్కోరు చేసినా.. లఖ్‌నవూ ఓపెనర్‌ మార్ష్‌ వీర బాదుడుకు అది సరిపోలేదు. బంతి బ్యాట్‌ను తాకితే బౌండరీ అన్నట్టుగా సాగిన తన విధ్వంసానికి సీఎ్‌సకే బౌలర్లు చేష్టలుడిగిపోయారు. అన్షుల్‌ ఓవర్‌లో 6,6,6,6,4తో 28 రన్స్‌ రాబట్టగా.. తర్వాతి ఓవర్‌లో 4,4,6తో 21 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అటు పవర్‌ప్లేలోనే లఖ్‌నవూ 86 పరుగులతో జట్టు గెలుపు దిశగా సాగింది. ఆ తర్వాత స్పిన్నర్‌ నూర్‌ రన్స్‌ను కాస్త కట్టడి చేసినా మిగతా బౌలర్లలో ఓపెనర్ల జోడీ వేగం చూపింది. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీకి 12వ ఓవర్‌లో చెక్‌ పడింది. ఇన్‌గ్లి్‌సను ముకేశ్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 70 బంతుల్లో 135 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే మార్ష్‌ రనౌటవడంతో రెండు బంతుల్లోనే ఈ ఇద్దరూ వెనుదిరిగినట్టయ్యింది. అబ్దుల్‌ సమద్‌ (7) నిరాశపర్చడంతో లఖ్‌నవూ ఆచితూచి ఆడింది. క్రీజులో పూరన్‌ ఉన్నా భారీ షాట్లకు వెళ్లలేదు. కానీ 17వ ఓవర్‌లో అతడు వరుసగా 4 సిక్సర్లతో 20 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


కార్తీక్‌ నిలకడ:

టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌లో యువ బ్యాటర్‌ కార్తీక్‌ శర్మ అండగా నిలిచాడు. చివర్లో శివమ్‌ దూబే మెరుపులకు సీఎ్‌సకే ఈ పిచ్‌పై సవాల్‌ విసిరే స్కోరందుకుంది. అయితే ఆరంభంలో లఖ్‌నవూ ఎడమచేతి పేసర్‌ ఆకాశ్‌ సింగ్‌ టాపార్డర్‌ను వణికించాడు. ఓపెనర్‌ రుతురాజ్‌ (13)తో పాటు తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లతో అదరగొట్టిన ఓపెనర్‌ సంజూ శాంసన్‌ను వరుస ఓవర్లలో తనే పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు కేవలం 37 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్‌లో భీకర ఫామ్‌ చాటుకున్న ఉర్విల్‌ (6)ను కూడా ఆకాశ్‌ అవుట్‌ చేయడంతో చెన్నై కష్టాల్లో పడినట్టు అనిపించింది. ఈ స్థితిలో యువ ఆటగాళ్లు కార్తీక్‌-బ్రెవిస్‌ సమన్వయంతో ఆడారు. బ్రెవిస్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలిచి జోరు చూపాడు. అటు ప్రిన్స్‌ ఓవర్‌లో కార్తీక్‌ రెండు సిక్సర్లతో 16 రన్స్‌ రాబట్టాడు. అలాగే షమి ఓవర్‌లో మరో సిక్సర్‌తో 34 బంతుల్లో కార్తీక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. కానీ అదే ఓవర్‌లో బ్రెవిస్‌ క్యాచ్‌ అవుట్‌ కావడంతో నాలుగో వికెట్‌కు 44 బంతుల్లోనే 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు కార్తీక్‌ మాత్రం స్పిన్నర్‌ షాబాజ్‌ ఓవర్‌లో 6,4,4తో చెలరేగి అతడికే చిక్కాడు. డెత్‌ ఓవర్లలో దూబే, ప్రశాంత్‌ (13 నాటౌట్‌) ఇబ్బందిపడ్డారు. ఎట్టకేలకు 19వ ఓవర్‌లో చెరో ఫోర్‌తో 11 పరుగులు రాగా.. చివరి ఓవర్‌లో దూబే చెలరేగి 6,4,4,6తో 23 రన్స్‌ రాబట్టడంతో స్కోరు 180+ దాటగలిగింది.

స్కోరుబోర్డు

చెన్నై: శాంసన్‌ (సి) ముకుల్‌ (బి) ఆకాశ్‌ 20, రుతురాజ్‌ (సి) పూరన్‌ (బి) ఆకాశ్‌ 13, ఉర్విల్‌ (సి) మార్ష్‌ (బి) ఆకాశ్‌ 6, కార్తీక్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) షాబాజ్‌ 71, బ్రెవిస్‌ (సి) ఆకాశ్‌ (బి) షమి 25, శివమ్‌ దూబే (నాటౌట్‌) 32, ప్రశాంత్‌ (నాటౌట్‌) 13, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 187/5; వికెట్ల పతనం: 1-31, 2-36, 3-52, 4-122, 5-142; బౌలింగ్‌: షమి 4-0-41-1, ఆకాశ్‌ 4-0-26-3, ప్రిన్స్‌ 4-0-49-0, మయాంక్‌ 4-0-26-0, షాబాజ్‌ 4-0-45-1.

లఖ్‌నవూ: మార్ష్‌ (రనౌట్‌) 90, ఇన్‌గ్లిస్‌ (సి) ఉర్విల్‌ (బి) ముకేశ్‌ 36, పూరన్‌ (నాటౌట్‌) 32, అబ్దుల్‌ సమద్‌ (బి) జాన్సన్‌ 7, ముకుల్‌ చౌదురి (నాటౌట్‌) 13, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 16.4 ఓవర్లలో 188/3; వికెట్ల పతనం: 1-135, 2-135, 3-144; బౌలింగ్‌: ముకేశ్‌ చౌదురి 3-0-24-1, స్పెన్సర్‌ జాన్సన్‌ 4-0-39-1, అన్షుల్‌ 2.4-0-63-0, నూర్‌ అహ్మద్‌ 4-0-21-0, గుర్జపనీత్‌ 3-0-34-0.


1-Sports.jpg

2

సీ ఎస్ కే తరఫున ఒకే మ్యాచ్‌లో ఎక్కువ పరుగులిచ్చుకున్న (2.4 ఓవర్లలో 63) రెండో బౌలర్‌గా అన్షుల్‌. ఖలీల్‌ (3 ఓవర్లలో 65) ముందున్నాడు

ఇవి కూడా చదవండి:

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

Updated Date - May 16 , 2026 | 03:02 AM