కేరళంలో రొనాల్డో సోదరి
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:48 AM
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో సందడి చేశారు....
తిరువనంతపురం: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో సందడి చేశారు. వ్యాపారవేత్త అయిన ఆమె ‘స్పార్కిల్ డైమండ్ ఫెస్ట్’ ప్రారంభించేందుకు ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి సతీశన్‌ను ఆమె కలిశారు. మళయాళీలకు ఫుట్‌బాల్ పట్ల ఉన్న ఆదరణ, రొనాల్డో అంటే అభిమానం గురించి సతీశన్ ఆమెకు చెప్పారు. ఆశ్చర్యపోయిన అవీరో.. తన సోదరుడికి ఇక్కడ ఉన్న క్రేజ్ గురించి స్వయంగా తెలియజేస్తానని చెప్పారు. ఈ వీడియోను సతీశన్ స్వయంగా ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..