నాకిదే చివరి ప్రపంచ కప్
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:47 AM
పోర్చుగల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డోకిదే చివరి ఫిఫా వరల్డ్‌కప్ కానుంది. ఈమేరకు అతను అధికారికంగా ప్రకటించాడు. ‘ఆటను ఎంత వరకు ఆస్వాదించామనేదే ముఖ్యం...
ప్రకటించిన రొనాల్డో
డాలస్: పోర్చుగల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డోకిదే చివరి ఫిఫా వరల్డ్‌కప్ కానుంది. ఈమేరకు అతను అధికారికంగా ప్రకటించాడు. ‘ఆటను ఎంత వరకు ఆస్వాదించామనేదే ముఖ్యం. ఇదే నా చివరి వరల్డ్‌కప్. ఏదో ఒక రోజు ఆటకు వీడ్కోలు పలకాల్సిందే. నా జీవితంలో అన్నింటినీ సాధించా. ఈసారి వరల్డ్‌కప్ గెలిచేందుకు ప్రయత్నిస్తా. 41 ఏళ్లు వచ్చినా నా ఆటను విమర్శిస్తూనే ఉన్నారు. ఇలాంటి విమర్శలతో వ్యక్తిగా మరింత మెరుగయ్యా. అలాగే గత 23 ఏళ్లుగా నన్ను అణగదొక్కాలని చూస్తూనే ఉన్నారు. కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు’ అని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రొనాల్డో తేల్చి చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ
ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు