మద్యం మానేశా చాహల్
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:14 AM
భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తన ఆరోగ్యం, ఫిట్‌నె్‌సను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నాడు. అల్కహాల్‌ను తీసుకోవడం పూర్తిగా మానేసినట్టు...
న్యూఢిల్లీ: భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తన ఆరోగ్యం, ఫిట్‌నె్‌సను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నాడు. అల్కహాల్‌ను తీసుకోవడం పూర్తిగా మానేసినట్టు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ చాహల్ తెలిపాడు. ‘గత ఆరు నెలలుగా నేను మద్యం తీసుకోవడం లేదు. నాకిప్పుడు 35 ఏళ్లు. అందుకే శారీరకంగా మరింత ఫిట్‌గా ఉండి, జట్టు కోసం 150 శాతం కృషి చేయాలన్నదే నా లక్ష్యం. అలాగే ఐపీఎల్‌లో సీనియర్ ఆటగాడిగా నా నుంచి ఇతరులు ఏమైనా నేర్చుకోవాలని ఆశిస్తున్నా. గత సీజన్‌లో గాయం కారణంగా క్వాలిఫయర్ 2, ఫైనల్లో ఆశించిన మేర రాణించలేదు. అందుకే ఈసారి నా శరీరం విషయంలో దృష్టి సారించా’ అని డివిల్లీర్స్‌కు ఇచ్చిన ప్యాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చాహల్ పేర్కొన్నాడు. కాగా గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లాడిన చాహల్ 16 వికెట్లు పడగొట్టాడు. ఇక మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో 174 మ్యాచ్‌ల్లో 221 వికెట్లు పతనంచేశాడు.
ఇవి కూడా చదవండి..
భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..
మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..