Share News

జూన్‌ 14న భారత్‌ X పాక్‌ పోరు

ABN , Publish Date - Feb 25 , 2026 | 06:06 AM

క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో మెగా ఈవెంట్‌ రాబోతోంది. ఇంగ్లండ్‌ వేదికగా ఈ ఏడాది జూన్‌ 12 నుంచి జూలై 5 వరకు మహిళల టీ20 వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ మేరకు మంగళవారం ఐసీసీ...

జూన్‌ 14న భారత్‌ X పాక్‌ పోరు

ఇంగ్లండ్‌ వేదికగా మెగా ఈవెంట్‌

  • మహిళల టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌

  • తొలిసారిగా బరిలోకి 12 జట్లు

దుబాయ్‌: క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో మెగా ఈవెంట్‌ రాబోతోంది. ఇంగ్లండ్‌ వేదికగా ఈ ఏడాది జూన్‌ 12 నుంచి జూలై 5 వరకు మహిళల టీ20 వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ మేరకు మంగళవారం ఐసీసీ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. టోర్నీ చరిత్రలో తొలిసారిగా 12 జట్లు టైటిల్‌ కోసం తలపడనుండగా, వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ గ్రూప్‌లో టాప్‌-2గా నిలిచిన జట్లు సెమీ్‌సకు వెళ్తాయి. గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, గ్రూప్‌ ‘బి’లో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, శ్రీలంక, ఐర్లాండ్‌ లీగ్‌ దశలో పోటీపడనున్నాయి. వీటిలో బంగ్లా, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌ క్వాలిఫయర్స్‌ ద్వారా అర్హత సాధించాయి. అలాగే నెదర్లాండ్స్‌కిదే తొలి టీ20 వరల్డ్‌కప్‌ కావడం విశేషం. ఇక టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు శ్రీలంకతో ఆడనుంది. అలాగే భారత్‌ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్థాన్‌ను ఎదుర్కొనబోతోంది. జూన్‌ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ పోరు జరుగనుంది. మరోవైపు గ్రూప్‌ ‘ఎ’లో పటిష్ట జట్లు ఉండడంతో హర్మన్‌ప్రీత్‌ సేనకు గట్టి సవాల్‌ ఎదురుకానుంది. మొత్తంగా ఏడు వేదికల్లో 33 మ్యాచ్‌లను నిర్వహించనుండగా, ఫైనల్‌కు ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత్‌ షెడ్యూల్‌

తేదీ ప్రత్యర్థి వేదిక

జూన్‌ 14 పాకిస్థాన్‌తో ఎడ్జ్‌బాస్టన్‌

జూన్‌ 17 నెదర్లాండ్స్‌తో హెడింగ్లీ

జూన్‌ 21 దక్షిణాఫ్రికాతో ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌

జూన్‌ 25 బంగ్లాదేశ్‌తో ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌

జూన్‌ 28 ఆస్ట్రేలియాతో లార్డ్స్‌

ఇవి కూడా చదవండి..

మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

Updated Date - Feb 25 , 2026 | 06:06 AM