Share News

విక్టరీ పరేడ్‌ ఉంటుందా?

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:25 AM

ధోనీ, రోహిత్‌ శర్మ సారథులుగా వరల్డ్‌క్‌పలు నెగ్గినప్పుడు ఓపెన్‌ టాప్‌ బస్‌లో విక్టరీ పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముంబైలోని రోడ్లన్నీ జనమయం అయ్యాయి. తాజాగా...

విక్టరీ పరేడ్‌ ఉంటుందా?

ధోనీ, రోహిత్‌ శర్మ సారథులుగా వరల్డ్‌క్‌పలు నెగ్గినప్పుడు ఓపెన్‌ టాప్‌ బస్‌లో విక్టరీ పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముంబైలోని రోడ్లన్నీ జనమయం అయ్యాయి. తాజాగా టీ20 వరల్డ్‌క్‌పను మరోసారి సాధించిన టీమిండియా ఈసారి విక్టరీ పరేడ్‌ నిర్వహిస్తుందా? లేదా? అనే దానిపై ఎటువంటి స్పష్టతా లేదు. అయితే, గతంలో ప్రకారం చూస్తే...జట్టు ప్రధాని నరేంద్ర మోదీని కలసిన తర్వాత పరేడ్‌ నిర్వహించారు. ఇప్పటి జట్టు మోదీని ఎప్పుడు కలుస్తుందనే దానిపై ఎటువంటి సమాచారమూ లేదని ఓ అధికారి చెప్పాడు. పైగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని పరేడ్‌ను ఈసారికి రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా ట్రోఫీలు గెలుస్తుండడంతో.. ఫ్యాన్స్‌లో కూడా మునుపటి తరహా ఉత్సాహం లేదని సమాచారం.

ఇవి కూడా చదవండి:

చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!

డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ

Updated Date - Mar 11 , 2026 | 03:25 AM