హిట్టర్లు.. బౌలర్లకు పరీక్ష
ABN , Publish Date - Feb 26 , 2026 | 05:36 AM
ప్రపంచ కప్ సూపర్-8లో భాగంగా గురువారం ఇక్కడ జరిగే మ్యాచ్‌లో వెస్టిండీ్‌స-దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటున్నాయి. భారీ హిట్టర్లతో నిండిన...
వెస్టిండీ్‌సగీదక్షిణాఫ్రికా మ్యాచ్ నేడు
మ. 3 గం. నుంచి
అహ్మదాబాద్: ప్రపంచ కప్ సూపర్-8లో భాగంగా గురువారం ఇక్కడ జరిగే మ్యాచ్‌లో వెస్టిండీ్‌స-దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటున్నాయి. భారీ హిట్టర్లతో నిండిన వెస్టిండీస్ బ్యాటింగ్‌కు..పదునైన పేసర్లతో కూడిన సఫారీల బౌలింగ్‌కు ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది. సూపర్-8లోని తమ ఆరంభ పోటీల్లో ఈ రెండు జట్లూ విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రంజుగా జరగడం ఖాయం.
ఈ మ్యాచ్‌పై రెండు జట్లకు ఉత్కంఠ
అయితే రాత్రి జరిగే తమ మ్యాచ్‌కు ముందు భారత్-జింబాబ్వే జట్లు మరో పోరుకోసం ఉత్కంఠగా ఎదురు చూడాల్సి వస్తోంది. అదే..దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ జట్ల నడుమ జరిగే గ్రూప్-1 పోరు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ బలంగా కోరుకుంటోంది. ఈ మ్యాచ్ ఫలితం టీమిండియా-జింబాబ్వే సెమీఫైనల్ అవకాశాలను ప్రభావితం చేయనుండడమే ఉత్కంఠకు కారణం.
ఇవి కూడా చదవండి:
మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్