‘3డీ’ విజయ్ శంకర్ క్రికెట్‌కు గుడ్‌బై
ABN , Publish Date - May 23 , 2026 | 02:40 AM
ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ దేశవాళీలతోపాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు శుక్రవారం ప్రకటించాడు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకొనే లక్ష్యంతో ఈ నిర్ణయం...
న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ దేశవాళీలతోపాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు శుక్రవారం ప్రకటించాడు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకొనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించాడు. తమిళనాడుకు చెందిన 35 ఏళ్ల విజయ్ 2018-2019 మధ్య 12 వన్డేలు, 9 టీ20లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ‘క్రికెట్ నా జీవితం. 10 ఏళ్ల వయస్సు నుంచే ఆడడం ప్రారంభించిన నేను.. 25 సంవత్సరాల తర్వాత క్రికెట్‌లో అన్ని స్థాయిల్లో ఆడినందుకు గర్విస్తున్నా.. మీ 3డీ విజయ్ శంకర్’ అంటూ సోషల్‌మీడియాలో అతడు పోస్ట్ చేశాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో మాంచెస్టర్‌లో వెస్టిండీ్‌సతో ఆడిందే అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్. కాలి వేలి గాయంతో ఆపై మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్‌లో చెన్నై, సన్‌రైజర్స్, ఢిల్లీ, గుజరాత్ జట్లకు విజయ్ ప్రాతినిధ్యం వహించాడు. 2019 వరల్డ్‌కప్‌లో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు స్థానం ఖాయమని భావించగా, చివరి నిమిషంలో అతడిని కాదని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు జట్టులో చోటు కల్పించడం వివాదాస్పదమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సత్తాచాటే 3డీ క్రికెటర్‌గా విజయ్‌ను ఎంపిక చేసినట్టు అప్పట్లో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో తాను 3డీ కళ్లద్దాలతో వరల్డ్ కప్ మ్యాచ్‌ను చూస్తానంటూ రాయుడు నాడు వ్యంగ్యంగా పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్
సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్