Share News

వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:41 AM

ప్రపంచ క్రికెట్‌లో తాజా సంచలనం, 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ జీవితంలో అపురూప క్షణాలివి. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైన వైభవ్‌ మంగళవారం టీమిండియా జెర్సీని..

వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో తాజా సంచలనం, 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ జీవితంలో అపురూప క్షణాలివి. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైన వైభవ్‌ మంగళవారం టీమిండియా జెర్సీని అందుకున్నాడు. గతంలో హర్భజన్‌, రైనా ఉపయోగించిన మూడో నెంబర్‌ను అతడికి కేటాయించారు. టీమిండియా త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ రఘు ఓ అట్టపెట్టెలో జెర్సీని తీసుకొచ్చి హోటల్లో ఉన్న వైభవ్‌ గది తలుపు తట్టాడు. రఘును చూడగానే వైభవ్‌ అతడి కాళ్లకు నమస్కరించి..ఆ పెట్టెను అన్‌బాక్స్‌ చేశాడు. జెర్సీని అందుకున్న వైభవ్‌..ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఈ రోజు నా కల నెరవేరింది. నా ప్రయాణంలో ఇదే అతిపెద్ద అడుగు. చాలా సంతోషంగా ఉంది’ అని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో వైభవ్‌ చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

Updated Date - Jun 24 , 2026 | 05:41 AM