వైభవ్ సెంచరీ మిస్
ABN , Publish Date - Sep 01 , 2026 | 05:26 AM
ఈస్ట్‌జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో చెలరేగాడు. ఎడాపెడా షాట్లతో తన శైలిలో పరుగులు రాబట్టాడు. అయి తే కొద్దిలో శతకం కోల్పోయాడు. సెంట్రల్ జోన్‌తో...
దులీప్ ట్రోఫీ
ఈస్ట్‌జోన్ 266 ఆలౌట్ నార్త్‌పై తిలక్‌వర్మ శతకం
బెంగళూరు: ఈస్ట్‌జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో చెలరేగాడు. ఎడాపెడా షాట్లతో తన శైలిలో పరుగులు రాబట్టాడు. అయి తే కొద్దిలో శతకం కోల్పోయాడు. సెంట్రల్ జోన్‌తో మ్యాచ్‌లో..సోమవారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్‌జోన్ 266 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ (81 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 92), మరో ఓపెనర్ అభిమన్యు (69) మొదటి వికెట్‌కు 161 పరుగులు జోడించారు. ఆపై సెంట్రల్‌జోన్ బౌలర్లు విజృంభించడంతో ఈస్ట్‌జోన్ 266 పరుగులకే చేతులెత్తేసింది. సెంట్రల్‌జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 266 రన్స్ చేసిన విషయం విదితమే. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సెంట్రల్‌జోన్ రెండో రోజు ఆఖరికి 45/3తో ఆడుతోంది.
సూర్యవంశీ రికార్డు పుటల్లో: అతి పిన్న వయస్సు (15 సంవత్సరాల 157 రోజులు)లో దులీప్ ట్రోఫీలో అర్ధ శతకం సాధించిన బ్యాటర్‌గా వైభవ్ రికార్డుల కెక్కాడు. ఈక్రమంలో 57 ఏళ్లనాటి(1969) లక్ష్మణ్ సింగ్ (16 ఏళ్ల 23 రోజులు) పేరిట ఉన్న రికార్డును దాటేశాడు.

సౌత్‌జోన్ 285/9: కెప్టెన్ తిలక్ వర్మ (106 బ్యాటింగ్) శతకబాదడంతో నార్త్‌జోన్‌తో సెమీఫైనల్లో సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకుంది. కిందటి రోజు స్కోరు 40/2తో సోమవారం, మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌత్‌జోన్ ఆట ముగిసే సరికి 285/9 పరుగులు చేసింది. తిలక్, గోపాల్ (87) ఆరో వికెట్‌కు 175 పరుగులు జోడించారు. నార్త్‌జోన్ తొ లి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్
రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం.. అకౌంట్లో మాత్రం రూ.3!