సెల్ఫీకి రూ. 100 ఇవ్వాలి!
ABN , Publish Date - Apr 28 , 2026 | 02:53 AM
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా చిన్నారుల్లో అతడికి క్రేజ్ అలా ఇలా లేదు...
చిన్నారులతో వైభవ్ సరదా
న్యూఢిల్లీ: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా చిన్నారుల్లో అతడికి క్రేజ్ అలా ఇలా లేదు. సూర్యవంశీ కూడా వారిని పలకరిస్తూ సరదాగా వ్యవహరిస్తున్నాడు. మంగళవారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌కోసం తన రాజస్థాన్ జట్టుతో కలిసి చత్తీ్‌సగఢ్ వెళ్లిన వైభవ్‌ను ఎయిర్‌పోర్టులో ఇద్దరు చిన్నారులు సెల్ఫీ అడిగారు. ఇందుకు వైభవ్.. ‘బ్రదర్.. ఫొటో కావాలంటే డబ్బులివ్వాలి. ఒక్కో ఫొటోకు రూ. 100 తీసుకొంటా. మీ దగ్గర ఎంతుందో చెప్పండి’ అని అన్నాడు. అందులో ఓ పిల్లోడు తన దగ్గర రూ. 200 ఉన్నాయని అనడంతో.. వైభవ్ ఫ్రాంక్ చేశానని చెప్పి నవ్వుతూ వారితో సెల్ఫీ దిగాడు. ఈ వీడియోను రాజస్థాన్ ఫ్రాంచైజీ నెట్‌లో పోస్టు చేసింది.
ఇవి కూడా చదవండి:
అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు
మూడేళ్ల నాటి సెహ్వాగ్ సవాల్.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!