డ్రెస్సింగ్ రూమ్‌లోకి నో ఎంట్రీ వైభవ్‌కు ప్రత్యేక గది
ABN , Publish Date - Jun 25 , 2026 | 05:23 AM
15 ఏళ్ల టీనేజర్ వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేసింది. అయితే, భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు ఉండేందుకు అవకాశం లేదని సమాచారం....
న్యూఢిల్లీ: 15 ఏళ్ల టీనేజర్ వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేసింది. అయితే, భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు ఉండేందుకు అవకాశం లేదని సమాచారం. ఇంగ్లండ్ బోర్డు, ఐసీసీ నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు వయసున్న ఆటగాళ్లు విడిగా వేరే గదిలో ఉండాల్సి ఉం టుంది. మ్యాచ్ సమయంలో, టీమ్ సమావేశాలకు మాత్ర మే ఇలాంటి ప్లేయర్లకు డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతి ఉంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి. వైభవ్‌తోపాటు అతడి తల్లిదండ్రులను కూడా బీసీసీఐ అనుమతించింది. దీంతో వారు వేరే గదిలో అతడికి తోడుగా ఉండనున్నారు.
సచిన్‌ను తలపిస్తున్నాడు: వైభవ్‌పై కపిల్
వైభవ్ సూర్యవంశీపై దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడు అపార ప్రతిభావంతుడని కొనియాడాడు. వైభవ్ బ్యాటింగ్ సచిన్ టెండూల్కర్‌ను తలపిస్తోందన్నాడు. ‘వైభవ్ ఇంకా చిన్నోడే. 20-22 సంవత్సరాలకు చేరుకున్నాక మనం అతడి గురించి అంచనా వేయొచ్చు. 16 ఏళ్ల వయస్సులో సచిన్ ఎలా ఆడేవాడో వైభవ్ కూడా అలానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ సచిన్‌లా సుదీర్ఘకాలం ఆడగలడా? వైభవ్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని కపిల్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!