కెప్టెన్ వైభవ్ రికార్డు
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:48 AM
బ్యాటర్‌గా ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలుగొట్టిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తాజాగా మరో మైలురాయిని చేరుకున్నాడు. కాకపోతే...
ఇండోర్: బ్యాటర్‌గా ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలుగొట్టిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తాజాగా మరో మైలురాయిని చేరుకున్నాడు. కాకపోతే ఈసారి కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో వైభవ్ బిహార్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈక్రమంలో పురుషుల టీ20 క్రికెట్‌లో అతి చిన్న వయస్సు (15 ఏళ్ల 232 రోజులు)లో సారథ్య బాధ్యతలు చేపట్టిన ఆటగాడి రికార్డును సొంతం చేసుకున్నాడు. దాంతో క్రొయేషియాకు చెందిన జాక్ ఉకుసిక్ (17 ఏళ్ల 311 రోజులు) రికార్డును సూర్యవంశీ అధిగమించాడు. 2025లో సైప్ర్‌సపై క్రొయేషియా కెప్టెన్‌గా ఉకుసిక్ ఆ రికార్డు నెలకొల్పాడు. ఇక..సారథిగా తొలి మ్యాచ్‌లో జట్టును వైభవ్ విజయపథాన నిలపలేకపోయాడు. మొదట బిహార్ 20 ఓవర్లలో 137/9 స్కోరుకే పరిమితమైంది. బ్యాటింగ్‌లోనూ వైభవ్ (12 బంతుల్లో 18) ఆకట్టుకోలేకపోయాడు. మోస్తరు ఛేదనను 16.3 ఓవర్లలో 138/5 స్కోరుతో పూర్తి చేసిన సౌరాష్ట్ర ఐదు వికెట్లతో నెగ్గింది.
ఈ వార్తలనూ చదవండి:
జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్
ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..