Share News

పాక్‌కు ఎవరూ రావద్దు

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:11 AM

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లు ఎవరూ రాకూడదంటూ తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) అనే మిలిటెంట్‌ గ్రూప్‌ హెచ్చరించింది...

పాక్‌కు ఎవరూ రావద్దు

  • విదేశీ క్రికెటర్లకు మిలిటెంట్ల హెచ్చరిక

  • స్టీవ్‌ స్మిత్‌ ఆగమనం

కరాచీ: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లు ఎవరూ రాకూడదంటూ తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) అనే మిలిటెంట్‌ గ్రూప్‌ హెచ్చరించింది. క్రికెట్‌కు తాము వ్యతిరేకం కాకపోయినా.. ప్రస్తుత పరిస్థితిలో పాక్‌ క్రీడలకు ఆతిథ్యమిచ్చే స్థితిలో లేదని బలూచిస్థాన్‌కు చెందిన ఆ గ్రూప్‌ పేర్కొంది. విదేశీ క్రికెట్‌ బోర్డులు తమ ఆటగాళ్లను పాక్‌కు పంపడం మానుకోవాలని, వారికేమైనా జరిగితే తమ బాధ్యత లేదంటూ టీటీపీ తేల్చింది. అయితే ఈ హెచ్చరికలు ఎలా ఉన్నా లీగ్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌ సోమవారం రాత్రి పాక్‌లో అడుగుపెట్టాడు. అలాగే విదేశీ ఆటగాళ్లకు రాష్ట్రపతిస్థాయి భద్రతను కల్పిస్తున్నట్టు పీసీబీ చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ తెలిపాడు. ఇక ఇంధన కొరతతో పాటు ఆర్థిక పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి పీఎ్‌సఎల్‌ను రెండు వేదికల్లోనే నిర్వహిస్తున్నారు. అలాగే ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడం లేదు. ఈ నిర్ణయాలను పరిహసిస్తూ పీఎ్‌సఎల్‌ను పెట్రోల్‌ షార్టేజ్‌ లీగ్‌గా ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఎగతాళి చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..

మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Updated Date - Mar 24 , 2026 | 06:11 AM