Share News

తిలక్‌కు రికార్డు ధర

ABN , Publish Date - Jun 08 , 2026 | 03:04 AM

టీజీ20 క్రికెట్‌ లీగ్‌లో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా తిలక్‌ వర్మ నిలిచాడు. ఆదివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన టీజీ20 లీగ్‌ వేలంలో మెదక్‌ ఫాల్కన్స్‌ జట్టు...

తిలక్‌కు రికార్డు ధర

  • రూ.33 లక్షలకు దక్కించుకున్న మెదక్‌

  • మిలింద్‌కు రూ.17 లక్షలు, సిరాజ్‌కు రూ.14 లక్షల ధర

  • టీజీ20 లీగ్‌ ఆటగాళ్ల వేలం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టీజీ20 క్రికెట్‌ లీగ్‌లో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా తిలక్‌ వర్మ నిలిచాడు. ఆదివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన టీజీ20 లీగ్‌ వేలంలో మెదక్‌ ఫాల్కన్స్‌ జట్టు రూ.33 లక్షలకు తిలక్‌ను దక్కించుకుంది. 8 ఫ్రాంచైజీలు కలిసి 160 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ప్రతి జట్టు 20 మందిని కొనుగోలు చేయగా, అందులో కనీసం నలుగురు జిల్లాల క్రికెటర్లకు అవకాశం కల్పించాయి. తిలక్‌ తర్వాత ఆల్‌రౌండర్‌ సీవీ మిలింద్‌ అత్యధిక ధర పలకడం విశేషం. మిలింద్‌ను రూ.17 లక్షలకు ఖమ్మం ఏసెస్‌, స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను రూ.14 లక్షలకు, అమన్‌రావును రూ.12 లక్షలకు వరంగల్‌ వారియర్స్‌, రవి కిరణ్‌ను రూ.13 లక్షలకు పాలమూరు స్ట్రయికర్స్‌, రవితేజను రూ.12 లక్షలకు మెదక్‌, అజయ్‌ దేవ్‌ గౌడ్‌ను రూ.11 లక్షలకు హైదరాబాద్‌ ఈ-చాంపియన్స్‌, తనయ్‌ త్యాగరాజన్‌ను రూ.11 లక్షలకు, ఆరోన్‌ జార్జ్‌ను రూ.7.5 లక్షలకు రంగారెడ్డి రైజర్స్‌ సొంతం చేసుకున్నాయి. అభిరథ్‌ రెడ్డి రూ.11 లక్షలకు హైదరాబాద్‌, అర్ఫాజ్‌ అహ్మద్‌ను రూ.11 లక్షలకు, రాహుల్‌ బుద్ధిని రూ.8 లక్షలకు నల్లగొండ నైట్స్‌, రోహిత్‌ రాయుడును రూ.6.5 లక్షలకు పాలమూరు స్ట్రయికర్స్‌ తీసుకున్నాయి. ఈనెల 21 నుంచి వచ్చేనెల 13 వరకు ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి:

టీ20 కెప్టెన్సీపై స్పందించిన శ్రేయస్ అయ్యర్

Updated Date - Jun 08 , 2026 | 03:04 AM