తిలక్ సూపర్ సెంచరీ
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:22 AM
టీజీ20 లీగ్ సోమవారంనాటి రెండో మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్‌రావ్, మెదక్ ఫాల్కన్స్ సారథి తిలక్ వర్మ...
ఉత్కంఠ పోరులో మెదక్ ఫాల్కన్స్ గెలుపు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టీజీ20 లీగ్ సోమవారంనాటి రెండో మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్‌రావ్, మెదక్ ఫాల్కన్స్ సారథి తిలక్ వర్మ సెంచరీలతో కదం తొక్కారు. అయితే అంతిమంగా మెదక్ విజయంతో బోణీ కొట్టింది. తొలుత వారియర్స్ 20 ఓవర్లలో 258/7 స్కోరు సాధించింది. అమన్ రావ్ (142), చౌదరి (35), అభిషేక్ (32) రాణించారు. భారీ ఛేదనలో తిలక్ (136 నాటౌట్) చెలరేగడంతో ఫాల్కన్స్ 19.4 ఓవర్లలో 259/7 స్కోరు చేసి నెగ్గింది. మరో మ్యాచ్‌లో కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ మెరుపు హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 71 నాటౌట్)తో రంగారెడ్డి రైజర్స్..నల్లగొండ నైట్స్‌పై గెలిచింది.
ఈ వార్తలనూ చదవండి:
లఖ్‌నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..