తనయ్ ‘పాంచ్’
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:29 AM
రంజీ గ్రూప్-బిలో ఆతిథ్య ఆంధ్రతో పోరులో హైదరాబాద్ 169 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తనయ్ త్యాగరాజన్...
ఆంధ్ర మొదటి ఇన్నింగ్స్184 ఆలౌట్
హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్ 78/2
విజయవాడ (ఆంధ్రజ్యోతి): రంజీ గ్రూప్-బిలో ఆతిథ్య ఆంధ్రతో పోరులో హైదరాబాద్ 169 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తనయ్ త్యాగరాజన్ (5/63) ఐదు వికెట్లతో విజృంభించడంతో ఆంధ్ర జట్టును తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే అవుట్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 9/0తో రెండోరోజైన సోమవారం మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర.. తనయ్‌కు తోడు అనికేత్ (2/60) చెలరేగడంతో 184 పరుగులకే కుప్పకూలింది. షేక్ రషీద్ (61) టాప్ స్కోరర్. కెప్టెన్ రికీ భుయ్ 28, శ్రీరామ్ రాహుల్ 27, త్రిపురాన విజయ్ 25 (నాటౌట్) రన్స్ చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన హైదరాబాద్ ఆట ముగిసేసరికి 23 ఓవర్లలో 78/2 స్కోరు చేసింది. అభిరత్ (23), రాహుల్ సింగ్ (2) నిరాశపరిచారు. తన్మయ్ అగర్వాల్ (49 నాటౌ ట్) క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 275 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.