Share News

దూబే దంచేశాడు

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:48 AM

శివం దూబే (31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66) అర్ధ శతకంతోపాటు స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (3/14) రాణించడంతో.. గ్రూప్‌ దశను భారత్‌ అజేయంగా ముగించింది....

దూబే దంచేశాడు

నేటి మ్యాచ్‌లు

వెస్టిండీస్‌ X ఇటలీ (ఉ. 11 గం. నుంచి)

శ్రీలంక X జింబాబ్వే (మ.3 గం.)

అఫ్ఘానిస్థాన్‌ X కెనడా (రా.7 గం.)

వరుణ్‌ తిప్పేశాడు

టీ20 వరల్డ్‌కప్‌

నెదర్లాండ్స్‌పై భారత్‌ విజయం

అహ్మదాబాద్‌: శివం దూబే (31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66) అర్ధ శతకంతోపాటు స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (3/14) రాణించడంతో.. గ్రూప్‌ దశను భారత్‌ అజేయంగా ముగించింది. టీ20 వరల్డ్‌క్‌పలో బుధవారం గ్రూప్‌-ఎ ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 193/6 స్కోరు చేసింది. సూర్యకుమార్‌ (34), తిలక్‌ వర్మ (31), హార్దిక్‌ పాండ్యా (30) రాణించారు. లోగన్‌ వాన్‌ బీక్‌ మూడు, ఆర్యన్‌ రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో నెదర్లాండ్స్‌ 176/7 స్కోరు మాత్రమే చేసింది. బాస్‌ డి లీడ్‌ (33), జాచ్‌ లయన్‌ (26) టాప్‌ స్కోర్లు. దూబే రెండు వికెట్లు దక్కించుకొన్నాడు. దూబే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

అభిషేక్‌ మళ్లీ విఫలం: దూబే, పాండ్యా డెత్‌ ఓవర్లలో మెరుపులు మెరిపించడంతో.. భారత్‌ భారీ స్కోరు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న భారత్‌కు ఆశించిన ఆరంభమైతే దక్కలేదు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (0)ను డకౌట్‌ చేసిన ఆర్యన్‌.. జోరు మీదున్న ఇషాన్‌ కిషన్‌ (18) కూడా వెనక్కిపంపాడు. అయితే, తిలక్‌, కెప్టెన్‌ సూర్య ఆచితూచి ఆడడంతో ఆరు ఓవర్లకు భారత్‌ 51/2తో నిలిచింది. మధ్య ఓవర్లలో డచ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ పరుగులను కట్టడి చేశారు. ఈ క్రమంలో 9వ ఓవర్‌లో తిలక్‌ను అవుట్‌ చేసిన వాన్‌ బీక్‌.. మూడో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దూబే కూడా షాట్లు ఆడడానికి ఇబ్బందిపడ్డాడు. కానీ, 12వ ఓవర్‌లో డి లీడ్‌ బౌలింగ్‌లో సూర్య సిక్స్‌ బాదగా.. ఆ తర్వాతి ఓవర్‌లో దూబే 6,4,6తో మొత్తం 19 పరుగులు రాబట్టడంతో టీమ్‌ స్కోరు కూడా సెంచరీ మార్క్‌ దాటింది. స్కోరు వేగం పుంజుకొంటున్న సమయంలో సూర్యను కైల్‌ క్యాచవుట్‌ చేయడంతో.. నాలుగో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో దూబే, పాండ్యా ధాటిగా ఆడడంతో.. టీమ్‌ స్కోరు 190 మార్క్‌ను అందుకొంది. ఆఖరి ఓవర్‌లో వీరిద్దరినీ వాన్‌బీక్‌ అవుట్‌ చేశాడు.


స్కోరుబోర్డు

భారత్‌: అభిషేక్‌ (బి) ఆర్యన్‌ 0, ఇషాన్‌ (బి) ఆర్యన్‌ 18, తిలక్‌ (సి) మెర్వే (బి) వాన్‌ బీక్‌ 31, సూర్య (సి/సబ్‌) గుగ్టెన్‌ (బి) క్లిన్‌ 34, దూబే (సి/సబ్‌) గుగ్టెన్‌ (బి) వాన్‌ బీక్‌ 66, హార్దిక్‌ (సి) మెర్వే (బి) వాన్‌ బీక్‌ 30, రింకూ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 193/6; వికెట్ల పతనం: 1-0, 2-39, 3-69, 4-110, 5-186, 6-193; బౌలింగ్‌: ఆర్యన్‌ 4-0-19-2, లోగన్‌ వాన్‌ బీక్‌ 4-0-56-3, ఎకర్‌మన్‌ 3-0-36-0, క్లిన్‌ 4-0-38-1, బాస్‌ డి లీడ్‌ 4-0-28-0, మెర్వే 1-0-15-0. నెదర్లాండ్స్‌: లెవిట్‌ (సి) సుందర్‌ (బి) పాండ్యా 24, ఒ డౌడ్‌ (బి) వరుణ్‌ 20, లీడ్‌ (సి) వరుణ్‌ (బి) దూబే 33, ఎకర్‌మన్‌ (సి) రింకూ (బి) వరుణ్‌ 23, ఆర్యన్‌ (బి) వరుణ్‌ 0, ఎడ్వర్డ్స్‌ (బి) బుమ్రా 15, జాచ్‌ లయన్‌ (సి) సుందర్‌ (బి) దూబే 26, క్రోయస్‌ (నాటౌట్‌) 25, వాన్‌ బీక్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 176/7; వికెట్ల పతనం: 1-35, 2-51, 3-94, 4-94, 5-112, 6-125, 7-172; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 3-0-22-0, బుమ్రా 3-0-17-1, సుందర్‌ 4-0-36-0, వరుణ్‌ 3-0-14-3, హార్దిక్‌ 3-0-40-1, అభిషేక్‌ 1-0-10-0, దూబే 3-0-35-2.

అభిషేక్‌

ట్రిపుల్‌ డక్‌

అభిషేక్‌ వరుసగా మూడోసారి డకౌట్‌ అయ్యాడు. ఈ క్రమంలో 2024 టీ20 వరల్డ్‌క్‌పలో తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ డకౌట్‌ అయిన ఉగాండా ప్లేయర్‌ రోజర్‌ ముకాసా తర్వాత ఆ చెత్త రికార్డును అందుకొన్న రెండో బ్యాటర్‌గా అభిషేక్‌ నిలిచాడు.

సూపర్‌-8 షెడ్యూల్‌

21 ఫిబ్రవరి పాకిస్థాన్‌ X న్యూజిలాండ్‌ కొలంబో రాత్రి 7 గం.

22 ఫిబ్రవరి శ్రీలంక X ఇంగ్లండ్‌ పల్లెకెలె మ. 3 గం.

భారత్‌ X దక్షిణాఫ్రికా అహ్మదాబాద్‌ రాత్రి 7 గం.

23 ఫిబ్రవరి జింబాబ్వే X వెస్టిండీ్‌స ముంబై రాత్రి 7 గం.

24 ఫిబ్రవరి ఇంగ్లండ్‌ X పాకిస్థాన్‌ పల్లెకెలె రాత్రి 7 గం.

25 ఫిబ్రవరి శ్రీలంక X న్యూజిలాండ్‌ కొలంబో రాత్రి 7 గం.

26 ఫిబ్రవరి వెస్టిండీ్‌స X దక్షిణాఫ్రికా అహ్మదాబాద్‌ మ. 3 గం.

భారత్‌ X జింబాబ్వే చెన్నై రాత్రి 7 గం.

27 ఫిబ్రవరి ఇంగ్లండ్‌ X న్యూజిలాండ్‌ కొలంబో రాత్రి 7 గం.

28 ఫిబ్రవరి శ్రీలంక X పాకిస్థాన్‌ పల్లెకెలె రాత్రి 7 గం.

1 మార్చి జింబాబ్వే X దక్షిణాఫ్రికా ఢిల్లీ మ. 3 గం.

భారత్‌ X వెస్టిండీ్‌స కోల్‌కతా రాత్రి 7 గం.

ఇవి కూడా చదవండి:

జట్టును గెలిపించాలన్న ఆలోచనే బాబర్ అజామ్‌కు లేదు: దినేశ్ కార్తిక్

Updated Date - Feb 19 , 2026 | 03:48 AM