Share News

సీఎస్‌కేను వీడిన ఫ్లెమింగ్‌

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:05 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తన పదవికి రాజీనామా చేశాడు. 2008 తొలి సీజన్‌లో ఆటగాడిగా బరిలోకి దిగిన ఫ్లెమింగ్‌.. ఆ తర్వాత నుంచి ఈ ఏడాది వరకు....

సీఎస్‌కేను వీడిన ఫ్లెమింగ్‌

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తన పదవికి రాజీనామా చేశాడు. 2008 తొలి సీజన్‌లో ఆటగాడిగా బరిలోకి దిగిన ఫ్లెమింగ్‌.. ఆ తర్వాత నుంచి ఈ ఏడాది వరకు...అంటే 18 ఏళ్లపాటు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఎంఎస్‌ ధోనీ-ఫ్లెమింగ్‌ జోడీ సీఎస్‌కేను అత్యంత విజయవంతమైన జట్టుగా నిలబెట్టింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ఇటీవలి కాలంలో అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. చివరి ఆరు సీజన్లలో నాలుగుసార్లు లీగ్‌ దశకే పరిమితమైంది. ‘ఫ్లెమింగ్‌, సీఎస్‌కే యాజమాన్యం మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పరస్పర అవగాహన మేరకే అతను పదవి నుంచి వైదొలిగాడు’ అని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

బదానికి చాన్స్‌?

దాదాపు 18 ఏళ్లపాటు కోచ్‌గా వ్యవహరించిన ఫ్లెమింగ్‌ నిష్క్రమణతో తర్వాత ఎవరు? అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు వచ్చే ఏడాది నుంచి ఎంఎస్‌ ధోనీ జట్టు మెంటార్‌గా వ్యవహరించనున్నాడని, అందుకే కోచ్‌ అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే కొత్త కోచ్‌గా హేమంగ్‌ బదానిని నియమించే అవకాశం ఉందని సమాచారం. గత రెండు సీజన్లుగా అతను ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కానీ అతని ఆధ్వర్యంలో ఢిల్లీ ఐదు, ఆరో స్థానాల్లో నిలవడం గమనార్హం.

ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..

ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..

Updated Date - Jul 14 , 2026 | 05:05 AM