Share News

లంకకు చావోరేవో

ABN , Publish Date - Feb 25 , 2026 | 06:04 AM

టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు ఆతిథ్య శ్రీలంక జట్టు కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. సూపర్‌ 8లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో లంక గెలవడం...

లంకకు చావోరేవో

నేడు కివీ్‌సతో మ్యాచ్‌

  • రాత్రి 7.గం నుంచి

కొలంబో: టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు ఆతిథ్య శ్రీలంక జట్టు కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. సూపర్‌ 8లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో లంక గెలవడం తప్పనిసరి. ఇప్పటికే తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో 147 రన్స్‌తో చిత్తుగా ఓటమిపాలైంది. ఇక నేటి మ్యాచ్‌లో ఓపెనర్‌ నిస్సాంక రాణింపు కీలకం కానుంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించనుండగా వెల్లలగెపై జట్టు ఆధారపడనుంది. అటు కివీస్‌ జట్టు పాక్‌తో ఆడిన తొలి మ్యాచ్‌ వర్షార్పణం కావడంతో ఒక పాయింట్‌ లభించింది. లీగ్‌ దశలో చూపిన జోరును ఓపెనర్లు ఆలెన్‌, సైఫర్ట్‌ కొనసాగించాలనుకుంటున్నారు. గ్రూప్‌ 2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరడంతో.. మిగిలిన ఏకైక బెర్త్‌ కోసం న్యూజిలాండ్‌, పాక్‌లతో శ్రీలంక పోటీపడుతోంది.

ఇవి కూడా చదవండి..

మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

Updated Date - Feb 25 , 2026 | 06:04 AM